30.2 C
Hyderabad
Wednesday, October 2, 2024

ఉపాధి హామీ అమలులో… ‘తెలంగాణ’ రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్!

హైదరాబాద్: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్ గా నిలిచిందన్నారు రాష్ట్ర పంచాయతీరాజ, గ్రామీణ అభివృద్ధి, మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. హైదరాబాద్లోని బంజారాహిల్స్ లోని ‘మినిస్టర్ క్వార్టర్స్‘లో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం రాష్ట్ర కంప్యూటర్ ఆపరేటర్ అసోసియేషన్ 2022 సంవత్సరపు క్యాలెండర్ ను, డైరీని మంత్రి ఆవిష్కరించారు.
తెలంగాణ రాష్ట్రానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 13 కోట్ల 75 లక్షల పనిదినాలు కేటాయిస్తే, ఇప్పటివరకు 13 కోట్ల 40 లక్షల పనిదినాలు (97.97 శాతం) కల్పించామన్నారు మంత్రి. మరో 2 కోట్ల పని దినాలకు ఈ సంవత్సరంలో అనుమతి లభించిందని తెలిపారు. ఉపాధి హామీ పథకం కింద రాష్ట్రంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే ఇప్పటి వరకూ 3 వేల 498 కోట్ల, 40 లక్షల రూపాయలు ఖర్చు చేసినట్టు తెలిపారు మంత్రి. ఈ పథకం కింద కూలీలకు 2 వేల 381 కోట్ల రూపాయలు చెల్లించినట్లు మంత్రి వివరించారు. గ్రామాలలో జీవనోపాధి, మౌలిక వసతుల కల్పనకు 1065 కోట్ల 60 లక్షల రూపాయలు మెటీరియల్ రూపంలో చెల్లించామని ప్రకటించారు.
సీఎం కేసీఆర్ ఆదేశాలతో రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం వల్ల ఎన్నో సత్ఫలితాలు సాధిస్తున్నామని మంత్రి తెలిపారు. పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి అధికారులు, ఉద్యోగులు, ఉపాధి హామీ ఉద్యోగులు పథకం అమలుకు ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. గ్రామీణ పేదల ఉపాధికి, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి అమలు చేస్తున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తున్నదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపించారు.
కరోనా నేపథ్యంలో నిరుద్యోగులు గ్రామీణ ప్రాంతాలలో ఉపాధి పొందుతున్నారని, ఇప్పుడు వాళ్లకు అవకాశం కూడా దక్కకుండా కేంద్ర చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎర్రబెల్లి. దేశంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి 2021-22 ఆర్థిక సంవత్సరంలో 98 వేల కోట్ల రూపాయలు కేటాయించగా, 2022-23 ఆర్ధిక సంవత్సరంలో 73 వేల కోట్ల రూపాయలకు కుదించడం శోచనీయమని మంత్రి అన్నారు.
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఆవిర్భావ సందర్భంగా మంత్రి దయాకర్ రావు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles