25.7 C
Hyderabad
Wednesday, October 2, 2024

ప్రైవేట్ రంగంలో అత్యాధునిక రైల్వే కోచ్ ఫ్యాక్టరీ… హైదరాబాదులో ప్రారంభానికి సిద్ధం!

హైదరాబాద్: తెలంగాణ ఏర్పాటైన  7ఏళ్లలోనే రాష్ట్రం పారిశ్రామికంగా దూసుకుపోతుంది. వేలాది మందికి ఉద్యోగ, ఉపాధి కల్పనలో ముందు నిలుస్తోంది. తాజాగా   తెలంగాణలో ప్రైవేటు రంగంలో అతిపెద్ద, అత్యాధునిక  రైల్ కోచ్ ఫ్యాక్ట‌రీ త్వ‌ర‌లో ప్రారంభం కానుంది. దీని వ‌ల్ల వేల మందికి ఉద్యోగ అవ‌కాశాలు ల‌భించ‌నున్నాయి. రంగారెడ్డి జిల్లా కొడంక‌ల్‌లో మేధ గ్రూప్.. రైల్వే కోచ్ ఫ్యాక్ట‌రీని త్వ‌ర‌లోనే ప్రారంభించ‌నుంది. భార‌త్‌లో ఉన్న అతి పెద్ద ప్రైవేట్ రైల్వే కోచ్ ఫ్యాక్ట‌రీల‌లో ఇది ఒక‌టి. రూ.800 కోట్ల‌తో రైల్వ్ కోచ్ ఫ్యాక్ట‌రీని మేధ సంస్థ ఏర్పాటు చేసింది. సుమారు 2 వేల మందికి రైల్వే కోచ్ ఫ్యాక్ట‌రీలో ఉద్యోగ అవ‌కాశాలు రానున్నాయి. ఈ సందర్భంగా ఐటీ, పరిశ్రమల శాఖా మంత్రి కేటీఆర్ దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ ఆధునిక రైలు కోచ్ ఫ్యాక్టరీ రంగారెడ్డి జిల్లా కొండకల్‌లో త్వరలో ప్రారంభం కానుంది అంటూ నిన్న ఒక ట్వీట్ చేశారు: “మేధా గ్రూప్ స్థాపించిన భారతదేశంలోని అతిపెద్ద ప్రైవేట్ రైలు కోచ్ ఫ్యాక్టరీలలో ఒకటి కొండకల్‌లో ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది. తెలంగాణ త్వరలో రైలు కోచ్‌లను తయారు చేసి రవాణా చేయబోతున్నందుకు గర్వంగా ఉంది. యుగంధర్ రెడ్డి గారు (ఛైర్మన్, మేధా సర్వో డ్రైవ్స్) & అతని సమర్ధులైన టీమ్‌కి  నా హృదయపూర్వక ధన్యవాదాలు (sic).”  2017లో, TSIIC ద్వారా 100 ఎకరాల భూమిని ఈ కంపెనీకి కేటాయించారు, మేధ సంస్థ `1,000 కోట్లు పెట్టుబడి పెట్టింది. తద్వారా ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా 2,200 ఉపాధి అవకాశాలను సృష్టిస్తుందని హామీ ఇచ్చింది. అన్ని రకాల కోచ్‌లు, లోకోమోటివ్‌ల తయారీకి ప్రధాన కేంద్రంగా సిద్ధంగా ఉన్న ఈ ఫ్యాక్టరీ, వివిధ రకాలైన 500 కోచ్‌లను మరియు 50 లోకోమోటివ్‌లను తయారు చేయగల వార్షిక సామర్థ్యాన్ని కలిగి ఉంది. 2020 ఆగస్టులో మంత్రి స్వయంగా దీనికి పునాదులు వేశారు. మరోవంక రాష్ట్ర ప్రభుత్వం 150 ఎకరాల భూమిని కేటాయించినప్పటికీ, కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీని స్థాపించడంలో కేంద్రం  విఫలమైన విషయాన్ని రామారావు పదే పదే కేంద్ర ప్రభుత్వానికి గుర్తు చేస్తున్నారు. 2022-23 కేంద్ర బడ్జెట్‌ వెలువడిన కొద్ది రోజుల్లోనే కేటీ రామారావు చేసిన తాజా ట్వీట్  బీజేపీ శ్రేణులకు మింగుడు పడడం లేదు. రైల్వే కోచ్ ఫ్యాక్ట‌రీ యూనిట్‌ ఫోటోల‌ను మంత్రి త‌న ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles