25.7 C
Hyderabad
Wednesday, October 2, 2024

గద్వాలలో ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవ ర్యాలీ!

గద్వాల్ : ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా  పొగాకు ఉత్పత్తుల వల్ల కలిగే దుష్పరిణామాలను ఎండగడుతూ గద్వాలలో పొగాకు వ్యతిరేక దినోత్సవ ర్యాలీ నిర్వహించారు.    డిఎం హెచ్ ఓ డాక్టర్ జి.రాజు, డాక్టర్ శశికళ ఆధ్వర్యంలో ఈ  ర్యాలీ జరిగింది.  పాత డిఎం హెచ్‌ఓ కార్యాలయం వద్ద ప్రారంభమై గాంధీచౌక్‌ వద్ద ఈ ర్యాలీ ముగిసింది. అక్కడ జిల్లా వైద్య ఆరోగ్య సిబ్బంది, ఆశా వర్కర్లు పాల్గొని ర్యాలీ అనంతరం పొగాకు వినియోగానికి వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేశారు.

ఈ సందర్భంగా డాక్టర్ శశికళ మాట్లాడుతూ.. పొగాకు సంబంధిత ఉత్పత్తులు ప్రాణహాని, క్యాన్సర్‌లకు దారితీస్తాయని పేర్కొన్నారు. “ప్రపంచ పొగాకు నిరోధక దినోత్సవం” ప్రతి సంవత్సరం  మే 31న నిర్వహిస్తారు. ఆ రోజు పొగాకు వినియోగానికి వ్యతిరేకంగా ప్రభుత్వాలు, సంఘాలు, సమాజం తగిన చర్యలు తీసుకునేలా ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకున్నారు.

ప్రతి సంవత్సరం, ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని వివిధ థీమ్‌లతో జరుపుకుంటామని        డా. శశికళ  పేర్కొన్నారు.  పొగాకు వ్యతిరేక కార్యక్రమం భాగంగా ఈ ఈ కార్యక్రమం నిర్వహించామని ఆమె పేర్కొన్నారు.

ఈ ర్యాలీలో సిహెచ్‌ఓ రామకృష్ణ, జిల్లా ప్రోగ్రాం కోఆర్డినేటర్లు శ్యాంసుందర్ మక్సూద్, డిపి హెచ్‌ఎస్‌ఓ వరలక్ష్మి, సిసి వెంకటేష్, సబ్ యూనిట్ అధికారి శివన్న, డివిఎల్‌ఎం నరేంద్రబాబు, హెల్త్ సూపర్‌వైజర్లు లక్ష్మి, పార్వతమ్మ, అర్బన్ హెల్త్ సెంటర్ల సిఇఒ హనుమంతు నరసింహులు, హెల్త్ అసిస్టెంట్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.  ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవ ర్యాలీ విజయవంతానికి వీరంతా సహకరించారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles