30.7 C
Hyderabad
Wednesday, October 2, 2024

జలవనరుల పునరుద్ధరణపై అధికారులు దృష్టి సారించాలి… మంత్రి కేటీఆర్!

హైదరాబాద్: జలవనరుల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుందని, ఇందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని పునరుద్ఘాటించిన పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కెటి రామారావు నగరం చుట్టూ  నీటి వనరుల పునరుద్ధరణపై దృష్టి సారించాలని అధికారులను కోరారు.
హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ) పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనుల సమీక్షా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ రాజధాని ప్రాంతంలోని నీటి వనరులను పరిరక్షించడమే కాకుండా పునరుద్ధరణకు కూడా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
కొంతమంది నీటి సంరక్షణ నిపుణులతో వీడియో కాన్ఫరెన్స్‌లో సంభాషించిన మంత్రి, హెచ్‌ఎండీఏ పరిధిలోని నీటి వనరుల రక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.
“తెలంగాణ ప్రభుత్వం… రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి నీటి వనరుల సంరక్షణ, పరిరక్షణకు అత్యధిక ప్రాధాన్యతనిస్తుంది. జలవనరుల చుట్టూ సుందరీకరణ పనులు చేపట్టడంలో హెచ్‌ఎండీఏ కీలకపాత్ర పోషిస్తుందన్నారు.
హెచ్‌ఎండీఏతో పాటు గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) కూడా చెరువుల చుట్టూ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తోందని పేర్కొన్న మంత్రి, భవిష్యత్తులో నీటి వనరుల మెరుగైన నిర్వహణ కోసం కార్యాచరణ ప్రణాళికను రూపొందించేందుకు జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ రెండు పౌర సంస్థలు కలిసి పనిచేయాలని కోరారు.
గండిపేట వంటి ప్రధాన నీటి వనరుల వద్ద ఇప్పటికే చేపట్టిన అభివృద్ధి, పరిరక్షణ కార్యక్రమాలను హైలైట్ చేసిన మంత్రి, హైదరాబాద్ ప్రజలకు గొప్ప అనుభూతిని కలిగించే గండిపేట సరస్సు సుందరీకరణ పనులను వేగవంతం చేయడంపై దృష్టి సారించాలని అధికారులను కోరారు.
భూముల విలువ పెరిగిన నేపథ్యంలో హెచ్‌ఎండీఏ పరిధిలోని భూముల రక్షణకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రేడియల్ రోడ్ల పటిష్టత, మూసీ నది పునరుజ్జీవన పనులు, మూసీ నదిపై వంతెనల నిర్మాణం, హెచ్‌ఎండీఏ ల్యాండ్‌పూలింగ్‌ ప్లాన్‌లు, లాజిస్టిక్‌ పార్కుల నిర్మాణం తదితర అంశాలపై జరిగిన సమీక్షా సమావేశంలో పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ అరవింద్‌కుమార్‌తోపాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles