28.2 C
Hyderabad
Wednesday, October 2, 2024

లంగర్‌హౌజ్ చెరువుకు కొత్త అందాలు… లక్షలమందికి ఆహ్లాదం!

హైదరాబాద్: నిన్నటి వరకు కాలుష్య వ్యర్థాలు, గుర్రపు డెక్కతో కంపుకొట్టిన లంగర్‌హౌజ్ చెరువు రూపు రేఖలు ఒక్కసారిగా మారిపోయాయి.  లంగర్‌హౌజ్ చెరువును అభివృద్ది పర్చాలన్నా పురపాలక శాఖ మంత్రి ఆదేశాల మేరకు  జిహెచ్‌ఎంసి  ఆగమేఘాలతో సుందరీకరణ బాట పట్టింది.  ఇందులో భాగంగా  మేయర్ విజయలక్ష్మి లంగర్ హౌజ్ చెరువును సందర్శించడమే కాకుండా సుందరీకరణ పనులను వేగవంతం చేయాలని అదేశించారు.
దీంతో అధికారులు చెరువులో పేరుకుపోయిన గుర్రపు డెక్కతో పాటు కాలుష్యా వ్యర్థాలను తొలగించి చెరువును పరిశుభ్ర పర్చారు. గుర్రపు డెక్క తొలగింపు ప్రక్రియతో పాటు చెరువులో దోమల నివారణకు జిహెచ్‌ఎంసి యు.బి.డి, ఎంటమాలజి శాఖలు సమన్వయంతో యాంటీ లార్వా ఆపరేషన్‌ను నిర్వహించారు. ఎంటమాలజీ విభాగం కూడా డ్రోన్‌లను ఉపయోగించి యాంటీ లార్వా కార్యకలాపాలను నిర్వహిస్తోంది. సువాసనతో పాటు తేలియాడే చెత్తను కూడా శుభ్రం చేశారు. సందర్శకులను ఆకట్టుకునేలా వాటర్ బాడీని మార్చేందుకు జీహెచ్ఎంసీ దాదాపు రూ.4 కోట్లు వెచ్చించేందుకు సిద్ధమవుతోంది. ప్రతిపాదిత పనులలో ఫెన్సింగ్, డి-సిల్టింగ్, వాకింగ్, సైక్లింగ్ ట్రాక్, నీటి ఇన్‌లెట్ల శుద్ధి, మురుగునీటిని మళ్లించడం వంటివి ఉన్నాయి. సరస్సు సుందరీకరణకు కనీసం ఏడాదికి పైగా సమయం పడుతుందని అధికారులు తెలిపారు. దాని చుట్టూ ఉన్న పర్యావరణాన్ని పరిరక్షించాలనే ప్రతిపాదన కూడా ఉంది. జిహెచ్‌ఎంసి ఖైరతాబాద్ జోన్ అధికారులతో పాటు ఎంటమాలజీ విభాగం సిబ్బంది సమిష్టి కృషితో 15 రోజుల్లో ఈ పనులను పూర్తి చేశారు. డీ సిల్టింగ్ పనులు ఇంకా జరగలేదు. మేయర్ ఎప్పటికప్పుడు పనులను పర్యవేక్షించడంతో పాటు అధికారులను అప్రమత్తం చేయడంతో 41 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న చెరువు పూర్తి పరిశుభ్రంగా మారింది. లంగర్ హౌస్ చెరువు కొత్త రూపు సంతరించుకోవడానికి  విశేష కృషి చేసిన వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది… మేయర్ విజయలక్ష్మి అభినందనలను అందుకున్నారు.
చెరువుతో పాటు అక్కడ ఉన్న హెచ్‌ఎండిఎ పార్కు అభివృద్దికి సైతం  శ్రీకారం చుట్టారు. ఈ పార్కు సుందరీకరణ బాధ్యతలను యుబిడి విభాగం అధికారులకు అప్పగించారు. పార్కులో వాకింగ్ ట్రాక్‌తో పాటు పూర్తిగా ఆహ్లాదకరాన్ని పంచే విధంగా  తీర్చిదిద్దుతున్నారు. ఇందులో భాగంగా సువాసను వెదజల్లే ప్రత్యేక మొక్కలను నాటుతున్నారు. ఈ పార్కు సుందీకరణ పూరైతే పరిసర ప్రాంతాల్లో 40 కాలనీలో నివాసం ఉంటున్న 3 లక్షల మందికి ఉపయోగపడనుంది. లంగర్‌హౌజ్ చెరువును అభివృద్ది పర్చాలన్న పురపాలక శాఖ మంత్రి ఆదేశాల మేరకు మేయర్ విజయలక్ష్మి ఈ చెరువుతో పాటు ఆక్కట ఉన్న హుడా పార్కును దత్తతకు తీసుకున్న విషయం తెలిసిందే…

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles