32.1 C
Hyderabad
Wednesday, October 2, 2024

వీహెచ్‌పీ చట్టానికి అతీతమా? కేటీఆర్!

హైదరాబాద్: విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) చట్టానికి అతీతమా అంటూ తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీ. రామారావు మంగళవారం నాడు అన్నారు. దేశ రాజ‌ధాని ఢిల్లీలోని జహంగీర్‌పూరిలో హనుమాన్ జయంతి ఊరేగింపు సందర్భంగా జరిగిన హింసాకాండకు సంబంధించి తమ కార్యకర్తలపై ఏదైనా చర్య తీసుకుంటే ఢిల్లీ పోలీసులపై యుద్ధం చేస్తామని విశ్వ‌హిందూ ప‌రిష‌త్ బెదిరించినట్లు వచ్చిన వార్తల నేప‌థ్యంలోనే మంత్రి కేటీఆర్ ఈ వ్యాఖ్య‌లు చేశారు.  ఢిల్లీ పోలీసులపై ఈ విపరీతమైన ధోర‌ణిని సహిస్తారా? అని కేంద్ర హోంమంత్రి  అమిత్ షాను కేటీఆర్ ప్రశ్నించారు.
ట్విట్ట‌ర్ వేదిక‌గా మంత్రి కేటీఆర్ ఢిల్లీలో చోటుచేసుకున్న మ‌త హింసాత్మ‌క ఘ‌ట‌న‌ల‌పై స్పందించారు. విశ్వ‌హిందూ ప‌రిష‌త్ పోలీసుల‌ను బెదిరించిన వ్యాఖ్య‌ల‌పై.. “వీరు దేశ చట్టానికి అతీతులా? హోం మంత్రి అమిత్ షాజీ ” అని ట్వీట్ చేశారు. అలాగే, “మీకు నేరుగా నివేదించే ఢిల్లీ పోలీసులపై ఇలాంటి దారుణమైన అర్ధంలేని మాటలు మీరు సహిస్తారా?” అని కేటీఆర్ ప్ర‌శ్నించారు. అనుమతి లేకుండా ఊరేగింపు నిర్వహించినందుకు నిర్వాహకులపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి స్థానిక విశ్వ‌హిందూ ప‌రిష‌త్ (వీహెచ్‌పీ) నాయకుడిని అరెస్టు చేసిన తర్వాత వీహెచ్‌పీ ఇలాంటి బెదిరింపులు చేసింది.

 

కాగా, కేటీఆర్ మరో ట్వీట్‌లో ఎన్డీయే ప్రభుత్వాన్ని ఎన్‌పీఏగా అభివర్ణించారు. “భారతదేశంలో నిరుద్యోగం 45 ఏళ్ల గరిష్టానికి, ద్రవ్యోల్బణం 30 ఏళ్ల గరిష్టానికి, ఇంధన ధరలు ఆల్ టైమ్ హై, ఎల్‌పిజి సిలిండర్ ధర ప్రపంచంలోనే అత్యధికం, వినియోగదారుల విశ్వాసం అత్యల్పంగా ఉందని ఆర్‌బిఐ చెబుతోంది” అని ఆయన రాశారు.

“దీనిని మనం ఎన్‌డిఎ ప్రభుత్వం అని పిలవాలా లేక ఎన్‌పిఎ ప్రభుత్వం అని పిలవాలా? భక్తుల NPA నాన్ పెర్ఫార్మింగ్ అసెట్ కోసం,” అని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, పరిశ్రమలు, మునిసిపల్ మంత్రి కేటీఆర్ అన్నారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles