30.7 C
Hyderabad
Wednesday, October 2, 2024

ట్యాంక్‌బండ్‌పై మళ్లీ సండే-ఫండే… ఆగస్ట్‌ 14నుంచి పునఃప్రారంభం!

హైదరాబాద్: నగరవాసులు ఆహ్లాదంగా గడపాలంటే ముందుగా గుర్తొచ్చేది ట్యాంక్ బండ్. మూసీ నది లో ఆశీనుడైన బుద్ధ భగవానుడిని చూసేందుకు.. అక్కడి పరిసరాల్లో ఆహ్లాదంగా గడిపేందుకు వేలాదిగా తరలివస్తుంటారు. ఫ్యామిలీతో కొద్దిసేపు సరదాగా గడిపేందుకు అనువైన ప్రదేశం. ఈ నేపథ్యంలో ఆగస్ట్ 14 నుంచి ట్యాంక్ బండ్ వద్ద సండే-ఫండే పునఃప్రారంభం కానుంది. ఈ మేరకు పురపాలక శాఖామంత్రి కేటీఆర్ స్పష్టతనిచ్చారు.

ట్విట్టర్‌లో ‘ఆస్క్ కేటీఆర్’ సెషన్‌లో  మంత్రి కెటి రామారావుకు చేసిన సూచన మేరకు ఈవెంట్‌ను మళ్లీ ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండిఎ) ఆగస్టు 14 నుండి ఈ కార్యక్రమాన్ని పునరుద్ధరించనుంది.

2021లో ప్రారంభమైన సండే-ఫండే కార్యక్రమం బ్యాండ్ ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు నగరవాసులను ఎంతో అలరించాయి. దీంతో ఈ కార్యక్రమం బాగా విజయవంతమైంది. సండే-ఫండే  జరిగే సమయాల్లో ట్యాంక్‌బండ్‌ అంతా ట్రాఫిక్‌ లేకపోవడంతో ప్రజలు పెద్ద సంఖ్యలో విహారయాత్రకు వచ్చి స్నాక్స్‌ను ఆస్వాదించేవారు. కోవిడ్-19 పరిమితులతో సహా అనేక కారణాల వల్ల ఇది గత కొన్ని నెలలుగా నిర్వహించడంలేదు.

అప్పట్లో హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో  ప్రతి ఆదివారం నిర్వహించిన సండే ఫండ్‌ కార్యక్రమానికి నగర వాసుల నుంచి విశేష స్పందన లభించింది. ప్రతివారం ప్రత్యేక షోలు నిర్వహిస్తూ సందర్శకులను ఆకట్టుకుంటున్నారు. అక్కడ ఏర్పాటుచేసిన వివిధ రకాల ఫుడ్‌ స్టాల్స్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సాయంత్రం 5 గంటల నుంచి అర్ధరాత్రి వరకు ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ ఆగస్ట్ 14నుంచి సండే-పండే కార్యక్రమం పునరుద్ధరణతో మళ్లీ హైదరాబాదీలకు కావాల్సినంత వినోదం లభ్యమవడం ఖాయం.

సండే-ఫండే ఈవెంట్ పునరుద్ధరణకు సంబంధించి ట్విట్టర్‌లో ‘ఆస్క్ కేటీఆర్’ సెషన్‌లో  మంత్రి చేసిన సూచన…

దీనికి ప్రతిస్సందనగా పురపాలక శాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి అర్వింద కుమార్ రీట్వీట్

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles