28.2 C
Hyderabad
Wednesday, October 2, 2024

హైదరాబాద్‌లో సైకిల్ ట్రాక్‌ల కోసం ప్రణాళికలు సిద్ధం!

హైదరాబాద్: గ్రీన్ సిటీ లక్ష్యంగా హైదరాబాద్‌ పరిధిలో సైకిళ్ల వినియోగానికి మరింత ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. నగరంలో సైకిళ్ల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్‌ఎంసి) తన పరిధిలోని 709.49 కి.మీ ప్రధాన రహదారి నెట్‌వర్క్‌లో సాధ్యమయ్యే చోట సైకిల్ ట్రాక్‌లను నిర్మించాలని నిర్ణయించింది.

రోలింగ్ హిల్స్ నుండి ఏఐజీ హాస్పిటల్స్ వరకు 450 మీటర్ల సైకిల్ ట్రాక్, బయో డైవర్సిటీ జంక్షన్ నుండి లెదర్ పార్క్ వరకు 2 కి.మీ సైక్లింగ్ ట్రాక్,  ఖాజాగూడ నుండి నానక్రామ్‌గూడ వరకు 2.25 కి.మీ సైక్లింగ్ ట్రాక్ ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నాయి. ఇతర ప్రధాన రహదారుల్లో టోలిచౌకి నుండి షేక్‌పేట స్ట్రెచ్, నర్సాపూర్ రహదారి నుండి బాలానగర్, మెట్టుగూడ నుండి తార్నాక ప్రాంతాల్లో  సైక్లింగ్ ట్రాక్‌ల ఏర్పాటు పనులు పురోగతిలో ఉన్నాయి. ఈ ట్రాక్‌లు సాధారణ ట్రాఫిక్ నుండి సైక్లిస్ట్‌ను వేరుచేయడానికి ఇరువైపులా బారికేడ్‌లు ఉంటాయి. తద్వారా సాఫీగా సైక్లింగ్ చేయొచ్చు. అంతేకాదు  భద్రత కూడా ఉంటుంది.

ప్రత్యేక సైకిల్ ట్రాక్‌ను అభివృద్ధి చేయలేని ప్రధాన రహదారులపై, సైక్లిస్టుల కోసం ప్రత్యేకంగా ఒక ప్రాంతాన్ని గుర్తించి, ఆయా ప్రాంతాల్లో సైక్లిస్టుల భద్రత కోసం రహదారిపై తాత్కాలిక బారికేడ్‌లను ఉంచాలని అనుకుంటున్నారు. ఈ బారికేడ్లను రోజు తెల్లవారుజామున ఉంచి ఆఫీసు సమయాలలో తొలగించనున్నారు. అయితే, ఈ ప్రాజెక్టుకు సంబంధించి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ & అర్బన్ డెవలప్‌మెంట్ (MA&UD) విభాగం నిర్ణయం తీసుకుంటుందని జీహెచ్‌ఎంసీ అధికారి ఒకరు తెలిపారు.

సైక్లిస్టుల కోసం ఈ సౌకర్యాలు మున్సిపల్‌-పట్టణాభివృద్ధి శాఖా మంత్రి కేటీఆర్‌ సూచనల మేరకు అభివృద్ధి చేస్తున్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని ట్రాక్‌లు నిర్మించనున్నారు. ఇలాంటి సౌకర్యాలను పెద్ద ఎత్తున అభివృద్ధి చేయడానికి ట్రాక్ నమూనాపై మున్సిపల్‌-పట్టణాభివృద్ధి విభాగం తుది నిర్ణయం తీసుకుంటుంది, ”అని అధికారి తెలిపారు.

నగరంలో 709.49 కిలోమీటర్ల మెయిన్ రోడ్ నెట్‌వర్క్‌ను కాంప్రహెన్సివ్ రోడ్ మెయింటెనెన్స్ ప్రోగ్రామ్ (CRMP) ఏజెన్సీలకు నిర్వహణ కోసం అప్పగించినప్పటికీ, ఈ ఏజెన్సీలే కాకుండా, జీహెచ్ఎంసీ సైతం కొన్ని ట్రాక్‌లను అభివృద్ధి చేస్తోంది. సైక్లింగ్ ట్రాక్‌లను అభివృద్ధి చేసేందుకు జోనల్ స్థాయిలో అంచనాలు సిద్ధం చేశామని, వాటిని ఆమోదం కోసం పంపాలన్నారు. సైకిల్‌ ట్రాక్‌లతో పాటు పలు చోట్ల పేవ్‌మెంట్లు నిర్మించి మొక్కలు పెంచుతున్నారు.

రెండేళ్ల క్రితమే.. సైక్లింగ్ ఫ్రెండ్లీ సిటీ కింద రిజిస్టర్ అయిన 95 నగరాల్లో హైదరాబాద్ కూడా ఎంపిక కావడంతో గ్రేటర్ పరిధిలో ఇండియా సైకిల్ 4 చేంజ్ ఛాలెంజ్ కార్యక్రమాన్ని మెట్రో పాలిటన్ డెవలఫ్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండిఎ), హైదరాబాద్ యూనిఫైడ్ మెట్రో పాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ అథారటీ (హెచ్‌యుఎంటిఎ)ల సాంకేతిక, సలహాలు సూచనలతో ఇప్పటికే అమలు చేస్తున్న విషయం తెలిసిందే.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles