32.1 C
Hyderabad
Wednesday, October 2, 2024

తెలంగాణలో 65 వేలకు పైగా ఇంజినీరింగ్ సీట్లు భర్తీ కానున్నాయి!

హైదరాబాద్: ఈ విద్యాసంవత్సరం అంటే 2022-23, తెలంగాణ స్టేట్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్ మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TS EAMCET) 2022 అడ్మిషన్ కౌన్సెలింగ్‌లో కన్వీనర్ కోటా కింద మొత్తం 65,633 ఇంజినీరింగ్ సీట్లు భర్తీ కానున్నాయి.

వీటిలో 17,154 సీట్లు..  కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ (CSE) కోర్సులో అందుబాటులో ఉన్నాయి.  తర్వాత ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్‌లో 11,375 సీట్లు అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా, సీఎస్ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్,  మెషిన్ లెర్నింగ్ కోర్సులో ప్రవేశానికి 7,032 సీట్లు అందుబాటులో ఉన్నాయి.

డేటా సైన్స్,  సైబర్ సెక్యూరిటీలో కెరీర్ ఆరంభించాలనుకునే వారికి, రాష్ట్రవ్యాప్తంగా వివిధ ఇంజనీరింగ్ కళాశాలల్లో వరుసగా 3,549, 1,680 సీట్లు ఉన్నాయి. అదేవిధంగా, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రోగ్రామ్ ఆఫర్‌లో 4,692 సీట్లు ఉన్నాయి. కోర్ కోర్సులు ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్‌లో 5,337,, సివిల్ ఇంజనీరింగ్‌లో 4,548 సీట్లు,   మెకానికల్ ఇంజనీరింగ్‌లలో  4,284 సీట్లు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కాలేజీల్లో సీట్లను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేయడంతో మొత్తం సీట్ల సంఖ్య పెరగవచ్చని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.

కాగా, బుధవారం వరకు మొత్తం 58,807 మంది అభ్యర్థులు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం స్లాట్‌ను బుక్ చేసుకున్నారు. అలాగే, బుధవారం  నాడు 18,636 మంది విద్యార్థులు సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరుకాగా, 2,314 మంది అభ్యర్థులు వెబ్ ఆప్షన్లను వినియోగించుకున్నారు.

సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ప్రాసెసింగ్ ఫీజు, స్లాట్ బుకింగ్ చెల్లించడానికి చివరి తేదీ ఆగస్టు 29. స్లాట్‌ను బుక్ చేసుకున్న అభ్యర్థులకు సర్టిఫికేట్‌ల వెరిఫికేషన్‌కు గడువు ఆగస్టు 30. సర్టిఫికేట్ వెరిఫికేషన్‌లో పాల్గొన్న అభ్యర్థులు సెప్టెంబర్ వరకు వెబ్ ఆప్షన్‌లను ఉపయోగించాలి. మెరుగైన కళాశాల, కోర్సులో అలాట్‌మెంట్ పొందేందుకు అభ్యర్థులు వీలైనన్ని ఎక్కువ ఆప్షన్లను ఇవ్వాలని సూచించారు. మొదటి దశ సీట్ల కేటాయింపు సెప్టెంబర్ 6న పూర్తవుతుంది.

ఇక పూర్తి వివరణాత్మక నోటిఫికేషన్, హెల్ప్ లైన్ సెంటర్‌ల జాబితా, కోర్సుల జాబితా మరియు TS EAMCET-2021 అడ్మిషన్ల చివరి ర్యాంక్ స్టేట్‌మెంట్‌లు https://tseamcet.nic వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుంది.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles