30.7 C
Hyderabad
Wednesday, October 2, 2024

మునుగోడు ఉప ఎన్నిక… మంత్రి జగదీశ్​ రెడ్డికి ఎన్నికల సంఘం నోటీసు!

హైదరాబాద్: ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి, భారత రాష్ట్ర సమితి  నాయకుడు జి జగదీశ్ రెడ్డికి ఎన్నికల సంఘం నోటీసు పంపింది. టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయకపోతే సంక్షేమ పథకాలు నిలిపివేస్తామంటూ జగదీశ్ రెడ్డి చేసిన ప్రసంగం ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడమేనని బీజేపీ నేత దిలీప్ కుమార్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

దీనిపై స్పందించిన ఎన్నికల సంఘం… జిల్లా ఎన్నికల అధికారితో మాట్లాడి నివేదిక తెప్పించారు. మంత్రి ఎన్నికల ప్రవర్తన నియమావళని ఉల్లంఘించినట్లు అభిప్రాయపడింది. ఈ మేరకు ఆయనకు నోటీసులు జారీ చేసింది. అక్టోబర్ 29 మధ్యాహ్నం 3 గంటల లోపు వివరణ ఇవ్వాలని నోటీసుల్లో స్పష్టం చేసింది.

ఇప్పుడు జరుగుతున్న ఉప ఎన్నిక కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, రాజగోపాల్‌రెడ్డిల మధ్య కాదు, రూ.2000 పింఛన్‌ కొనసాగించాలా వద్దా అన్నది, రైతుబంధు కొనసాగించాలా వద్దా, 24 గంటల ఉచిత కరెంట్‌ కొనసాగించాలా.. దివ్యాంగులకు రూ.3వేల పింఛన్‌ కొనసాగించాలా వద్దా.. పథకాల కొనసాగింపుపై చిత్తశుద్ధి ఉన్నవారు కారుకు ఓటేసి కేసీఆర్‌కు అండగా నిలవాలి.. రూ.3వేల పింఛన్‌ వద్దని మోదీ చెప్పారని, తప్పకుండా ఇస్తానని కేసీఆర్‌ చెప్పారు. ఎవరికైనా పింఛన్‌పై ఆసక్తి లేకపోతే మోదీకి ఓటేయవచ్చు.. ఎవరికైనా ఈ పథకాలు కావాలంటే కేసీఆర్‌కు ఓటు వేయండి’’ అని మంత్రి అన్నారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles