32.1 C
Hyderabad
Wednesday, October 2, 2024

మున్సిపాలిటీల్లో వార్డు ఆఫీసర్ల నియామకం… మిగతా రాష్ర్టాలకు తెలంగాణ ఆదర్శం!

హైదరాబాద్‌: మున్సిపాలిటీల్లో వార్డుకో ఆఫీసర్‌ విధానాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో గ్రూప్-4 నోటిఫికేషన్ ద్వారా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ శాఖ పరిధిలో వార్డు ఆఫీసర్‌ పోస్టులు భర్తీ చేయనున్నారు.  రాష్ట్రంలోని మొత్తం 141 మున్సిపాలిటీలలో వార్డు ఆఫీసర్లను నియమించడానికి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ & అర్బన్ డెవలప్‌మెంట్ శాఖ సన్నాహాలు చేస్తోంది.

తద్వారా దేశంలోనే మున్సిపాలిటీల్లో వార్డు ఆఫీసర్లను నియమించిన తొలి రాష్ట్రం తెలంగాణ అవతరించనుంది. తెలంగాణ మినిస్టీరియల్ సర్వీసెస్‌లో వార్డు స్థాయిలో విభిన్న పాత్రలు, బాధ్యతలతో వార్డ్ ఆఫీసర్ పోస్ట్ కొత్తగా చేర్చారు. పట్టణ స్థానిక సంస్థల (ULB)లో హరితహారం, పారిశుధ్యం, ఘన వ్యర్థాల నిర్వహణ, సామాజిక భద్రతా పథకాలు,  ఇతర మునిసిపల్ సేవలను మెరుగైన పర్యవేక్షణ, సమర్థవంతంగా అమలు చేయడంలో వార్డు అధికారుల నియామకం సహాయపడుతుందని భావిస్తున్నారు.

దీంతో 50 వేల వరకు జనాభా ఉన్న మున్సిపాలిటీల్లో రెండు వార్డులకు ఒక వార్డు ఆఫీసర్‌, 50 వేల కంటే ఎక్కువ జనాభా ఉన్న మున్సిపాలిటీల్లో ఒక్కో వార్డుకు ఒక వార్డు ఆఫీసర్‌ ఉంటారు.  పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీతో పంచాయతీల్లో పల్లె ప్రగతి కార్యక్రమం విజయవంతంగా అమలయ్యేందుకు ఎంతో దోహదపడింది. ఇదే విధంగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పరిపాలనను మెరుగుపరిచేందుకు ప్రతి వార్డుకూ ఓ ఆఫీసర్‌ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. దేశంలో ఎక్కడా లేని ఈ విధానాన్ని తొలిసారి తెలంగాణలో అమలు చేయనున్నారు. దీంతో అన్ని రాష్ర్టాలకు తెలంగాణ ఆదర్శంగా నిలువనున్నది.

“టీఎస్‌పీఎస్సీ తాజాగా జారీ చేసిన గ్రూప్-4 నోటిఫికేషన్‌లో భాగంగా… మొత్తం 141 మున్సిపాలిటీలలో వార్డు ఆఫీసర్లను నియమించనుంది. దీని ద్వారా పౌర సమస్యలపై మరింత దృష్టి సారించవచ్చు.  వార్డు కౌన్సిలర్‌లతో సమన్వయం చేసుకోవడంలో ఈ నియామకాలు మరింత సహాయపడతాయి. ఈ నియామకాలకు అనుమతి ఇచ్చిన సీఎం కేసీఆర్‌కు నా కృతజ్ఞతలు” అని మంత్రి కేటీఆర్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

‘వార్డు అధికారుల’ పాత్ర, బాధ్యతలు:

  • శానిటరీ, పబ్లిక్ హెల్త్ వర్కర్ల పనిని పర్యవేక్షించడం
  •  ఇంటింటికీ చెత్త  సేకరణపై పర్యవేక్షణ, వ్యర్థాలను వేరు చేయడం
  •  క్రమం తప్పకుండా ఊడ్చడం, డ్రైనేజీలు, పబ్లిక్ టాయిలెట్లను శుభ్రం చేయడం
  • అంటువ్యాధుల నివారణ, నియంత్రణ కోసం చర్యలు ప్రారంభించడం
  • ప్రభుత్వ, ప్రైవేట్ మార్కెట్లు, మటన్ & చికెన్ స్టాల్స్, కబేళాల్లో పారిశుధ్యాన్ని నెలకొల్పడం.
  • సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధాన్ని సమర్థవంతంగా అమలు చేయడం
  •  ఘన & ద్రవ వ్యర్థాల నిర్వహణ
  •  హరితహారం కార్యకలాపాలు, కనీసం 85 శాతం మనుగడతో పచ్చదనం అభివృద్ధి, నిర్వహణ.
  •  వీధి దీపాల పర్యవేక్షణ, నీటి సరఫరా
  •  పెన్షన్లు (సామాజిక భద్రతా పథకాలు), ఇతర సంక్షేమ పథకాలు, పట్టణ పేదరిక నిర్మూలన కార్యక్రమాలు

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles