32.1 C
Hyderabad
Wednesday, October 2, 2024

లక్ష్యాన్ని మరిచిన తెలంగాణ ‘మైనారిటీ స్టడీ సర్కిల్‘… పనితీరులో విఫలం!

హైదరాబాద్: తెలంగాణలోని మైనారిటీ వర్గాలకు చెందిన ఉద్యోగార్థులకు కోచింగ్ అందించే లక్ష్యంతో, ప్రభుత్వం ఏడేళ్ల క్రితం మైనారిటీ స్టడీ సర్కిల్ (TSMSC)ని స్థాపించింది. ఈ సంస్థ ద్వారా సివిల్ సర్వీసెస్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్, పోలీస్, సాయుధ దళాలు, ఇతర వృత్తిపరమైన కోర్సులలో మైనారిటీ అభ్యర్థులకు కోచింగ్ అందించాలన్న సదుద్దేశంతో ఈ స్టడీ సర్కిల్‌ను 2015, సెప్టెంబర్ 24 న ప్రారంభించారు. అయితే ఏ మంచిపని కోసం ఈ సంస్థను ఏర్పరిచారో అది మాత్రం పెద్దగా నెరవేరనేలేదు.

మైనారిటీ స్టడీ సర్కిల్‌ కోసం తొలుత ప్రభుత్వం రూ.6 నుంచి 8 కోట్ల బడ్జెట్ కేటాయించింది. ఆ తర్వాత ఆ మొత్తాన్ని రూ.2 కోట్లకు తగ్గించింది. బడ్జెట్ విషయంలో ప్రభుత్వం పెద్దగా పట్టించుకోకపోవడంతో ఏ ఏడాది కూడా పూర్తిస్థాయిలో నిధులు విడుదల కాలేదు. గత 8 ఏళ్లలో కేటాయించిన నిధులు కేవలం జీతాలు, ఇతర అవసరాలకే ఖర్చు చేశారు.

ఏటా 100 మంది మైనారిటీ అభ్యర్థులను స్టడీ సర్కిల్ ద్వారా సివిల్ సర్వీసెస్ కోచింగ్ కోసం ఎంపిక చేసి, స్పాన్సర్ చేస్తారు. అయితే ఇప్పటి వరకు ఒక్క అభ్యర్థి కూడా IAS సాదించలేకపోయారు. మొదట్లో ప్రిలిమ్స్‌లో విజయం సాధించిన అభ్యర్థులు మెయిన్స్‌లో రాణించలేదు. ఇద్దరు అభ్యర్థులు ఇంటర్వ్యూకు చేరుకున్న తర్వాత ఫెయిలయ్యారు.

మైనారిటీ స్టడీ సర్కిల్ వైఫల్యానికి కారణం ప్రభుత్వం నిర్ణయించిన ఎంపిక ప్రమాణాలేనన్న విమర్శలు లేకపోలేదు.  గ్రామీణ ప్రాంతాల్లో అభ్యర్థులకు రూ.1,50,000, పట్టణ ప్రాంతాల్లో రూ.2,00,000 వార్షిక ఆదాయ పరిమితిని నిర్ణయించారు. ఫలితంగా నాన్-సీరియస్ అభ్యర్థులను ఎంపిక చేశారు. కర్నాటకలో మాదిరిగా వార్షిక ఆదాయ పరిమితిని 5 లక్షలకు పెంచినట్లయితే, చాలా మంది అర్హులైన అభ్యర్థులు కోచింగ్‌లో చేరే అవకాశముండేది. అలా అయితే  సివిల్ సర్వీస్ పరీక్షల్లో మరింతముందుకు సాగే ఛాన్సులు మెండుగా ఉండేవన్న అభిప్రాయం అందరిలో వ్యక్తమవుతోంది.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles