30.7 C
Hyderabad
Wednesday, October 2, 2024

తెలంగాణలో కొలువుల పండగ…. మరో 7వేల ఉద్యోగాల భర్తీకి క్యాబినెట్ ఆమోదం!

  • కొత్తగా 7 వేల ఉద్యోగాలు
  • బీసీ గురుకులాల్లో 2,591 పోస్టుల భర్తీ
  • పోలీసు శాఖ సైబర్‌ సేఫ్టీలో 3,966..
  • ఆర్‌అండ్‌బీలో 472 ఉద్యోగాలు
  • రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం

హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభుత్వం ప్రకటించిన మెగా జాబ్ మేళాలో భాగంగా… కొత్తగా  మరో ఏడువేల ఉద్యోగాలు వచ్చి చేరాయి. ఇప్పటికే 80,039 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ శరవేగంగా సాగుతుండగా…  సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన శనివారం నిర్వహించిన రాష్ట్ర క్యాబినెట్‌ సమావేశం పలుశాఖల్లో పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపింది.

పోలీస్‌శాఖను మరింత పటిష్ఠం చేయడంలో భాగంగా… ఆ శాఖల్లో  వివిధ విభాగాల్లో 3,966 పోస్టులను భర్తీ చేసేందుకు పచ్చజెండా ఊపింది. హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో కొత్త పోలీస్‌స్టేషన్లు, సర్కిళ్లు, డివిజన్లను ఏర్పాటు చేయడానికి క్యాబినెట్‌ ఆమోదముద్ర వేసింది.

బీసీ సంక్షేమానికి సంబంధించి మహాత్మా జ్యోతిబా ఫూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో 2,591 కొత్త పోస్టులు మంజూరయ్యాయి. ఈ విద్యా సంవత్సరంలో కార్యకలాపాలు ప్రారంభించిన నాలుగు జూనియర్ కళాశాలలు, 15 డిగ్రీ కళాశాలలు మరియు 33 రెసిడెన్షియల్ పాఠశాలలకు ఈ పోస్టులు ఉన్నాయి.

ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో  ఆర్‌అండ్‌బీ శాఖ ప్రతిపాదించిన పలు ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేసింది. అత్యవసర పరిస్థితుల్లో వివిధ మరమ్మతులు, పునర్నిర్మాణ పనులను చేపట్టేందుకు క్యాబినెట్ అధికారులకు అధికారం ఇచ్చింది.

ఆర్&బీ శాఖలో ఆమోదించిన 472 అదనపు పోస్టుల్లో మూడు కొత్త చీఫ్ ఇంజనీర్ (CE) పోస్టులు, 12 సూపరింటెండెంట్ ఇంజనీర్ (SE) పోస్టులు, 13 ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (EE) పోస్టులు, 102 డిప్యూటీ EE పోస్టులు, 163 అసిస్టెంట్ EE పోస్టులు, 28 డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి. అంతేకాదు టెక్నికల్, నాన్-టెక్నికల్ సిబ్బంది పోస్టులు అనేకం ఉన్నాయి. ఈ ఉద్యోగాలను సాధ్యమైనంత త్వరగా రిక్రూట్‌మెంట్ ప్రక్రియను చేపట్టి, పదోన్నతుల ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని కూడా క్యాబినెట్  శాఖను ఆదేశించింది.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles