32.1 C
Hyderabad
Wednesday, October 2, 2024

హైదరాబాద్‌లో దేశంలోనే అతిపెద్ద ప్రోటోటైపింగ్ సెంటర్!

హైదరాబాద్ : నూతన ఆవిష్కరణల్లో దేశాన్ని అగ్రగామిగా నిలిపేందుకు తెలంగాణ ప్రభుత్వం తన ప్రణాళికలను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా దేశంలోనే అతిపెద్ద ప్రోటోటైపింగ్ సెంటర్ ‘టీ వర్క్స్ (T-Works)’ మార్చి 2న ప్రారంభించనున్నట్లు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. టీ వర్క్స్ ద్వారా దేశంలో ఆవిష్కరణలు, ఉత్పత్తులు మరింత వేగవంతం అవుతాయన్నారు. కాగా, మొత్తం 4.79 ఎకరాల్లో నిర్మించిన ఈ ప్రాంగణంలో… ‘స్టార్టప్స్‘కు ప్రోటో టైప్ మోడల్స్ రూపొందించేందుకు 200లకు పైగా మెషీన్లను ఏర్పాటు చేశారు.

వివిధ రకాల నమూనాలను (ప్రొటోటైప్‌) డిజైన్‌ చేయడం, నిర్మించడం ప్రస్తుతం చాలా ఖర్చుతో కూడుకొన్నది. అలాంటి ఖర్చుతో కూడిన వ్యవహారాన్ని పూర్తిగా తగ్గిస్తూ దేశంలోనే మొట్ట మొదటి ప్రోటోటైపింగ్‌ కేంద్రాన్ని తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడం విశేషం.

ఐటీ కారిడార్‌లోని ఐటీ హబ్‌ పక్కనే 4.7 ఎకరాల్లో సుమారు రూ.200 కోట్లతో టీ-వర్స్‌ను నిర్మించి, తయారీ యంత్రాలను అందుబాటులో ఉంచింది. సృజనాత్మకతగలవారు ఎవరైనా ఇక్కడికి  ఆలోచనతో వచ్చి ఒక పూర్తిస్థాయి ఉత్పత్తి నమూనాతో తిరిగి వెళ్లేలా, అన్ని విధాలుగా సహకరించే యంత్రాంగం ఒకే చోట కొలువుదీరి ఉండటం దీని ప్రత్యేకత.

ప్రస్తుతం టీ వర్క్స్‌ మొదటి దశ నిర్మాణం దాదాపు పూర్తైంది. వచ్చే నెల మార్చి 2న దీన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామని మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌ వేదికగా సోమవారం వెల్లడించారు. టీ-వర్క్స్‌ భవనానికి సంబంధించిన విశేషాలతో కూడిన వీడియోను ఆయన ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. దీన్ని ప్రారంభిస్తున్నానని తెలిపేందుకు సంతోషిస్తున్నానని చెప్పారు. మొత్తం 4.79 ఎకరాల్లో నిర్మించిన ఈ క్యాంపస్‌లో స్టార్టప్‌లు తమ ఆలోచనలకు అనుగుణంగా నమూనాలను తయారు చేసేందుకు అవసరమైన వందకుపైగా యంత్రాలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. నూతన ఆవిష్కరణల్లో దేశం అగ్రగామిగా మారేందుకు టీ-వర్క్స్‌ సహాయపడుతుందని తెలిపారు. ‘78 వేల చదరపు అడుగుల్లో ఉన్న ఈ ప్రొటోటైపింగ్‌ సెంటర్‌లో అత్యాధునిక సౌకర్యాలు ఉన్నాయి. నమూనాల రూపకల్పనకు ఇక్కడి పరికరాలు ఎంతో సహాయపడతాయి. ఇండియా ఉత్పత్తి ఆవిష్కరణ ప్రయాణాన్ని టీ-వర్క్స్‌నుంచి ప్రారంభిద్దాం. ఈ సెంటర్‌ ప్రారంభోత్సవం కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’ అని మంత్రి కేటీఆర్ ట్వీట్‌ చేశారు.

 

 

 

 

 

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles