గాజా: ఫుట్‌బాల్ ప్రపంచకప్ ఫైనల్లో అర్జెంటీనాపై స్పెయిన్ విజయం సాధించడంతో గాజాలోని పాలస్తీనియన్లు ఘనంగా సంబరాలు చేసుకున్నారు. గతంలో పాలస్తీనా దేశానికి స్పెయిన్ ప్రభుత్వం అందించిన మద్దతుకు కృతజ్ఞతగా అక్కడి ప్రజలు స్పెయిన్ జట్టుకు మద్దతు తెలిపారు. గాజాలోని నుసీరత్ శరణార్థి శిబిరంతో పాటు ఇతర ప్రాంతాలలో పాలస్తీనియన్లు పెద్ద సంఖ్యలో కేఫ్‌ల వద్ద, వీధుల్లో గుమికూడి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్క్రీన్‌ల ద్వారా మ్యాచ్‌ను తిలకించారు.
స్పెయిన్ దేశం పాలస్తీనాకు అనుకూలంగా దశాబ్దాలుగా స్టాండ్ తీసుకోవడం, పాలస్తీనా దేశాన్ని అధికారికంగా గుర్తించడం వంటి కారణాల వల్ల గాజా ప్రజలు స్పెయిన్‌ను తమ అభిమాన జట్టుగా భావించారు. నిత్యం యుద్ధ వాతావరణం, కష్టాలతో సతమతమవుతున్న గాజా వాసులకు… స్పెయిన్ విజయం ఒక అరుదైన ఆనందాన్ని, మానసిక ఉల్లాసాన్ని అందించింది.
ఇదిలా ఉండగా, స్పెయిన్ ప్రజలు తమ సొంత వేడుకల సమయంలో పాలస్తీనాను మరచిపోలేదు. తమ జాతీయ జట్టు ప్రపంచ కప్ విజయం సాధించిన అనంతరం, స్పెయిన్‌లో ప్రజలు పాలస్తీనా జెండాను ఎగురవేస్తూ, “పాలస్తీనాకు స్వేచ్ఛ” అని నినాదాలు చేస్తూ సంబరాలు చేసుకుంటున్నారు. స్పెయిన్ జాతీయ జట్టు స్టార్ అయిన లామిన్ యమాల్, 2025–2026 సీజన్‌లో స్థానిక లీగ్‌ను గెలుచుకున్నందుకు తన జట్టు బార్సిలోనా జరుపుకున్న సంబరాల్లో పాలస్తీనా జెండాను ఎగురవేశాడు. ఈ చర్యకు పాలస్తీనియన్ల నుండి ఆమోదం లభించగా, ఆ స్పెయిన్ స్టార్‌పై ఇజ్రాయెలీల నుండి విమర్శలు వెల్లువెత్తాయి.
పాలస్తీనియన్ల సంబరాలకు సంబధించిన వీడియో లింక్
فرحة فلسطينيين في غزة بهدف فوز إسبانيا بكأس العالم على حساب الأرجنتين#جريدة_العرب #قطر #إسبانيا pic.twitter.com/rVoaTmtLsw
— صحيفة العرب – قطر (@AlArab_Qatar) July 19, 2026


