24.2 C
Hyderabad
Tuesday, October 1, 2024

విలాసవంతమైన వివాహాలకు ముస్లింలు దూరంగా ఉండాలి…. మాజీ డీజీపీ అన్వరుల్ హుదా!

హైదరాబాద్: ముస్లిం సమాజంలో విలాసవంతమైన వివాహాల తీరుపై మాజీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సయ్యద్ అన్వరుల్ హుదా ఆందోళన వ్యక్తం చేశారు.  అలాంటి వివాహాలను బహిష్కరించాలని ఆయన ముస్లింలకు పిలుపునిచ్చారు. ఈ పద్ధతిని విస్మరించాలని సామాజికవేత్తలు పిలుపునిచ్చినప్పటికీ, ఎటువంటి మార్పు లేదు. కొంతమంది పరిశీలకుల అభిప్రాయం ప్రకారం, వివాహాలపై ఖర్చు భారీగా పెరిగింది. ఇలాంటి వివాహాలను బహిష్కరించాలని ముస్లిం పెద్దలు పదే పదే పిలుపునిస్తున్నారు. అయినా పరిస్థితిలో పెద్దగా మార్పు రావటం లేదు.

అతిథులకు ఇది విలాసవంతమైన వేడుక అయినప్పటికీ, ఆతిథ్యం ఇచ్చేవారు, ఒకరిని చూసి మరొకరు  లక్షల్లో ఖర్చు చేస్తున్నారు. మధ్యతరగతి కుటుంబానికి మూడు రోజుల వివాహ వేడుకకు రూ. 10 లక్షల నుండి రూ. 15 లక్షల వరకు ఖర్చవుతుంది, ఇది ఖచ్చితంగా వారి ఎన్నో సంవత్సరాల పొదుపు చేసుకున్న డబ్బును ఖర్చుపెట్టాల్సి వస్తోందని ఆయన అన్నారు.

కార్యక్రమంలో హుదా మాట్లాడుతూ.. స్వర్గంలో బంధుత్వాలు నిర్ణయమవుతాయంటారు. ఇస్లామిక్ నియమ నిబంధనల ఆధారంగా అబ్బాయిలు, అమ్మాయిల మధ్య వివాహాలు చేసే తల్లిదండ్రులకు అభినందనలు. వివాహాల్లో విపరీతమైన సంపదను వెచ్చించకుండా.. తల్లిదండ్రులు కొత్తగా పెళ్లయిన అబ్బాయిలు మరియు అమ్మాయిల విజయవంతమైన జీవితం కోసం కొంత సంపదను ఇస్తే బాగుంటుందని ఆయన అన్నారు.

మిల్లత్ సభ్యులు సయ్యద్ ఫరూఖ్ అహ్మద్ మాట్లాడుతూ… ఇస్లాం మతం మహిళల గౌరవాన్ని పెంచిందన్నారు. ఇస్లాం ఇళ్ళలో, సమాజంలో స్త్రీలకు గౌరవం ఇస్తుంది. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి, అంకితభావంతో ఆడపిల్లలకు విద్య, శిక్షణ అందించి అత్తమామల దగ్గరకు వెళ్లి సంతోషంగా జీవిస్తారని అన్నారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles