30.2 C
Hyderabad
Sunday, May 5, 2024

‘ఐకాన్జ్‌’ లో భారీ పెట్టుబడులు… మార్క్ జుకర్‌బర్గ్, బిల్ గేట్స్, జెఫ్ బెజోస్ నుండి నిధులు!

హైదరాబాద్: తెలుగువాడైన అభినవ్‌ వర్మ, సినీనటుడు దగ్గుబాటి రానా స్థాపించిన ‘ఐకాన్జ్‌’ అనే సంస్థ ప్రపంచ టెక్నాలజీ దిగ్గజాలు మార్క్ జుకర్‌బర్గ్, బిల్ గేట్స్, జెఫ్ బెజోస్ నుండి నిధులు పొందింది. దీంతో ఉత్సాహంగా ఉన్న ‘బాహుబలి’ నటుడు ఈ నిధులపై తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు.
రానా మాట్లాడుతూ… ఒక ఇంటలెక్చువల్‌ ప్రాపర్టీ (IP) యజమానిగా, బ్లాక్‌చెయిన్ ప్రపంచం అద్భుతమైన, అత్యంత విశ్వసనీయమైన అవకాశాలను గుర్తించడానికి, వాటిపై దృష్టి పెట్టడానికి ఉత్తమ మార్గంలో అద్భుతమైన అవకాశాలతో పాటు సవాళ్లను కూడా అందిస్తుంది.”
న్‌ఎఫ్‌టిలు, అవతారాలు లేదా ప్రాథమిక హక్కుల నిర్వహణ వంటి బహుళ ఫార్మాట్‌లలో గ్లోబల్ స్టేజ్‌లో ఇంటలెక్చువల్‌ ప్రాపర్టీ (IP) ఆస్తులను నిర్వహించడం, డబ్బు ఆర్జించడం ప్రారంభించడానికి నేను మరియు ఇతర ఇంటలెక్చువల్‌ ప్రాపర్టీ (IP) యజమానులు కనుగొన్న ఉత్తమ మార్గం ప్రపంచ స్థాయి బ్లాక్‌చెయిన్ అగ్రిగేషన్ కంపెనీ” అని యువ వ్యవస్థాపకుడు వివరించాడు.
కాన్జ్‌లో సహ-వ్యవస్థాపకుడిగా ఈ కొత్త అధ్యాయాన్ని ప్రారంభించేందుకు నేను సంతోషిస్తున్నాను, ‘అమర్ చిత్ర కథ’, ‘టింకిల్’ సురేష్ ప్రొడక్షన్స్ వంటి భారతీయ అతిపెద్ద ఇంటలెక్చువల్‌ ప్రాపర్టీ (IP)లతో భాగస్వామిగా ఉన్నందుకు మెటావర్స్‌లోకి మారుతున్నందుకు మేము సంతోషిస్తున్నాము” అని రానా దగ్గుబాటి చెప్పారు.
(Ikonz) అనేది డిజిటల్ ఆస్తులను నిర్వహించడంలో డిజిటల్ ఇంటలెక్చువల్‌ ప్రాపర్టీ (IP)లు, NFTలను మెటావర్స్‌లలో మానిటైజ్ చేయడంలో సహాయపడే ఒక ప్లాట్‌ఫారమ్. ఆగస్ట్ 2021లో దీన్ని స్థాపించారు. ఐకాన్జ్‌ ఇంటలెక్చువల్‌ ప్రాపర్టీ యజమానులు, కళాకారులు, ఇతర గుర్తులు, వారి డిజిటల్ ఆస్తులను నిర్వహించడంలో సేవలను అందిస్తోంది.
ఏమిటీ మెటావర్స్‌
‘ఫిల్మీమోజీ’ అనే తెలుగు సిరీస్‌ గురించి వినే ఉంటారు. ఐఫోన్‌లో మెమోజీ అనే సాంకేతికతతో ఇందులో పాత్రలను రూపొందించారు. వీటితో మనల్ని పోలిన అవతారాలను సృష్టించుకోవచ్చు. మెటావర్స్‌ సాంకేతికతకు ఇది తొలిమెట్టు మాత్రమే. మనల్ని పోలిన లేదా మనకు ఇష్టమైన ఓ రూపాన్ని సృష్టించుకుని మెటావర్స్‌లోకి అడుగుపెడతారు. ఇక బయటినుంచి ఆ పాత్రను నడిపించవచ్చు. మైక్రోఫోన్‌, మౌస్‌, కెమెరా లాంటి సాధారణ పరికరాలతోనే దాన్ని మాట్లాడించవచ్చు లేదా ప్రోగ్రామింగ్‌ చేసి వదిలేయవచ్చు. ఇక వర్చువల్‌ రియాలిటీ పరికరాలు ఉంటే మెటావర్స్‌ పాత్ర మరింత సజీవంగా మారిపోతుంది.
జూమ్‌ జూమ్‌
కార్పొరేట్‌ ప్రపంచంలో చర్చలు, సమావేశాలదే ముఖ్యపాత్ర. కీలకమైన నిర్ణయాలు తీసుకునేందుకు, ప్రణాళికలు రూపొందించేందుకు మేధోమథనమే మార్గం. ప్రస్తుతానికి ఆన్‌లైన్‌ సమావేశాలు ఇందుకు ఓ మార్గంగా ఉన్నాయి. వీటిలో ముఖాముఖి మాట్లాడుకునే అనుభూతి కలగదు. బోర్డ్‌ రూమ్‌లో కనిపించేంత స్థాయి భావోద్వేగాలు ఉండవు. కానీ మెటావర్స్‌లో అలా కాదు. అందరూ ఒకచోట కూర్చుని మాట్లాడుకుంటున్నట్టే ఉంటుంది.
ప్రపంచ యాత్ర
లోకమంతా చుట్టి రావాలనే కోరిక ఎవరికి మాత్రం ఉండదు? కాకపోతే కొంతమందికి ఉన్నచోటు నుంచి కదలాలంటే కంగారు. మరికొందరికి ఖర్చులు అడ్డు పడతాయి. కానీ మెటావర్స్‌లో మీ కండ్ల ముందు… వెన్నెల్లో తాజ్‌మహల్‌ సాక్షాత్కరిస్తుంది, పిరమిడ్ల మధ్య నడిచిన అనుభూతి కలుగుతుంది, అమెజాన్‌ అడవే పలకరిస్తుంది. అంతేకాదు, మిత్రులంతా కలిసి ఒకేసారి ఈ త్రీడీ ప్రదేశాల్లో విహరిస్తూ హడావుడి చేయవచ్చు.
విద్యాలోకం
తరగతి గదిలో కూర్చుని చరిత్ర పాఠాలు బట్టీపట్టాలంటే విసుగే. కానీ పక్కనే కూర్చుని పానిపట్టు యుద్ధాన్ని చూస్తున్న అనుభూతి కలిగితే! భౌతికశాస్త్రంలో కొరుకుడుపడని సూత్రాలను త్రీడీ రూపంలో కండ్లకు కడితే! మెటావర్స్‌లో తరగతి గదులు కాస్తా విజ్ఞానశాలలుగా మారిపోతాయి. ఇప్పటికే త్రీడీ రూపాల సాయంతో పాఠాలు చెబుతున్న ప్రయత్నం మొదలైంది. మెటావర్స్‌తో ఏకంగా అనుభూతి చెందుతూ నేర్చుకునే వెసులుబాటు వస్తుంది. మన జీవితంలోని ప్రతి అంశాన్నీ మెటావర్స్‌తో అనుసంధానించి ఉన్నచోటు నుంచే మన ‘అవతారం’తో కావాల్సిన పనులు చేసుకోవచ్చు. ఉద్యోగులను అజమాయిషీ చేయడం మొదలుకొని, పొలం పనుల పర్యవేక్షణ వరకూ సాంకేతికతతో సకలం సాధ్యమే!

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles