28.2 C
Hyderabad
Tuesday, October 1, 2024

డెన్మార్క్‌లో ఇస్లాం వ్యతిరేక నిరసనలు… డానిష్ రాయబారికి సమన్లు పంపిన టర్కీ!

అంకారా: డెన్మార్క్‌లో బహిరంగ ప్రదర్శనలో “ఖురాన్, టర్కీ జెండాను లక్ష్యంగా చేసుకుని జరిగిన దాడి”పై టర్కీ విదేశాంగ మంత్రిత్వ శాఖ డానిష్ రాయబారి డానీ అన్నన్‌ను వివరణ అడిగింది.

“భావ ప్రకటన స్వేచ్ఛ ముసుగులో జరిగిన ఈ హేయమైన చర్య” “ఆమోదించలేనిది”. దీనిని  తీవ్రంగా ఖండిస్తున్నట్లు, నిరసిస్తున్నట్లు టర్కీ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక రాతపూర్వక ప్రకటనలో తెలిపింది.

డెన్మార్క్ రాజధాని కోపెన్‌హాగన్‌లోని టర్కిష్ రాయబార కార్యాలయం ముందు శుక్రవారం  డెన్మార్క్‌లోని ‘రైట్ గ్రూప్ ది పేట్రియాట్స్ గో లైవ్’ సభ్యులు ఇస్లామోఫోబిక్ బ్యానర్‌లను ప్రదర్శించి ఇస్లాం వ్యతిరేక నినాదాలు చేశారని టర్కీ మీడియా నివేదించిన తర్వాత ఈ ప్రకటన వెలువడిందని జిన్హువా వార్తా సంస్థ తెలిపింది.

ఈ నిరసనను  ‘రైట్ గ్రూప్ ది పేట్రియాట్స్ గో లైవ్’ సభ్యులు తమ ఫేస్‌బుక్ పేజీలో ప్రత్యక్ష ప్రసారం చేసారని స్థానిక టీవీ నెట్‌వర్క్ CNN టర్క్ నివేదించింది.

“ప్రభుత్వాల అసమర్థత,  రాజకీయ సంకల్పం లేకపోవడంతో నేరస్థులు  శిక్షనుండి తప్పించుకుంటున్నారని, దీంతో ఇటువంటి ఘటనలు మరిన్ని జరుగుతున్నాయని  మంత్రిత్వ శాఖ ప్రకటనలో పేర్కొంది.

ఈ దుశ్చర్యకు పాల్పడిన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని, అటువంటి “రెచ్చగొట్టే చర్యలు” పునరావృతం కాకుండా సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని డానిష్ అధికారులను టర్కీ విదేశాంగ మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి చేసింది.

 

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles