లక్నో: ఉత్తరప్రదేశ్‌లో పెను విషాదం చోటు చేసుకుంది. కేవలం ఒక్కరోజులోనే గాలి, వాన బీభత్సానికి 89 మంది బలయ్యారు. ప్రయాగ్‌రాజ్, భదోహి, సోన్‌భద్ర, ఫతేపుర్ తదితర జిల్లాల్లో చోటుచేసుకున్న వేర్వేరు ఘటనల్లో మృతిచెందిన వారి వివరాలను అధికారులు వెల్లడించారు.
భారీ ఈదురు గాలులు, వర్షాల కారణంగా అనేక చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడగా, నివాస గృహాలు కూడా ధ్వంసమయ్యాయి. ఈ ఘటనల్లో మరో 53 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. 114 పశువులు చనిపోయాయి. 87 ఇళ్లకు నష్టం వాటిల్లింది.
బరేలిలో ఈదురుగాలుల దాటికి ఒక వ్యక్తి గాల్లోకి ఎగిరిన ఓ వీడియో ఇంటర్నెట్లో హల్చల్ చేస్తుంది.
https://x.com/ManjeetVishwas/status/2054731676287369622?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2054731676287369622%7Ctwgr%5E712ac8657984e419e1fdc67a05bf7dc6b2d45fab%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fd-1682514219629514980.ampproject.net%2F2605071401000%2Fframe.html
కాగా, అకాల వాతావరణం వల్ల జరిగిన నష్టాన్ని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పరిగణనలోకి తీసుకున్నారు. 24 గంటల్లోగా బాధితులకు సహాయం అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు.
