26.7 C
Hyderabad
Tuesday, October 1, 2024

రానున్న రోజుల్లో తెలంగాణ ఉక్కపోతతో అల్లాడిపోనుంది!

హైదరాబాద్: రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. రెండు రోజుల వ్యవధిలోనే ఉష్ణోగ్రతలు బాగా పెరిగాయి. సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉన్నదని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో రానున్న రోజుల్లో రాష్ట్రం ఉక్కపోతతో అల్లాడిపోనుంది.

రానున్న రోజుల్లో మరింతగా ఉష్ణోగ్రతలు పెరుగుతాయని అంచనా వేస్తూ భారత వాతావరణ శాఖ రాష్ట్రంలోని చాలా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. IMD ఈ వారంలో గరిష్ట ఉష్ణోగ్రత 45 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుందని అంచనా వేసింది.

ఆరెంజ్ అలర్ట్‌తో పాటు హైదరాబాద్‌లో 40 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్నందున ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది.

బుధవారం ఆదిలాబాద్‌లో అత్యధికంగా 42.2 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైంది. జగిత్యాల (41.5), మంచిర్యాల (41), కుమురం భీమ్ (40.5), నల్గొండ (40.5), ఆదిలాబాద్ (40.3), యాదాద్రి భువనగిరి (40.3), ములుగు (40.3), నాగర్‌కర్నూల్ (40.3)డిగ్రీలు ఉంది.

ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదైన ఇతర జిల్లాలు హైదరాబాద్‌, ఖైరతాబాద్‌లో అత్యధికంగా 37.6 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైంది. నైరుతి రుతుపవనాల సీజన్‌లో ఎల్‌నినో పరిస్థితులు ఏర్పడినప్పటికీ, సాధారణ వర్షపాతం నమోదవుతుందని IMD కూడా అంచనా వేసింది.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles