28.2 C
Hyderabad
Tuesday, October 1, 2024

కొంగర కలాన్‌లో 186 ఎకరాలను సేకరించాలని యోచిస్తోన్న ఫాక్స్‌కాన్!

హైదరాబాద్: తైవాన్‌కు చెందిన బహుళజాతి ఎలక్ట్రానిక్స్ కాంట్రాక్ట్ తయారీదారు ఫాక్స్‌కాన్ తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు తన ప్రణాళికలను వేగవంతం చేసింది. కొంగర కలాన్‌లోని తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (టిఎస్‌ఐఐసి) పార్క్‌లో సుమారు 186 ఎకరాలను రూ.196 కోట్లతో కొనుగోలు చేయాలని ప్రతిపాదించింది.

ఫాక్స్‌కాన్ ఇంటర్‌కనెక్ట్ టెక్నాలజీ లిమిటెడ్ (ఎఫ్‌ఐటి), దాని పూర్తి-యాజమాన్య అనుబంధ సంస్థ చాంగ్ యి ఇంటర్‌కనెక్ట్ టెక్నాలజీ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా, హైదరాబాద్‌లోని ఇబ్రహీంపట్నం మండలం కొంగర కలాన్ వద్ద 186.7 ఎకరాలను సేకరించేందుకు ప్రతిపాదించింది. ప్లాట్‌ను 23.8 మిలియన్ US డాలర్లకు (సుమారు రూ.196 కోట్లు) కొనుగోలు చేస్తున్నారు. దీన్ని TSIIC సీనియర్ అధికారి కూడా ధృవీకరించారు.

ఇందుకు సంబంధించిన సమాచారం FIT Hon Teng Limited సంస్థ వ్యాపారం, లాభాల నవీకరణ, దాని అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది, కర్మాగారాలు, పరిశోధన, అభివృద్ధి కేంద్రాలు, వసతి గృహాలను నిర్మించడం కోసం ప్రతిపాదిత భూ సేకరణ అని పేర్కొంది. దీనికి సంబంధించిన అంశాలను మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా పార్టీల మధ్య చర్చల ద్వారా నిర్ణయిస్తామని పేర్కొంది.

తెలంగాణలోని కొంగర కలాన్ పార్కులో తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు తన కంపెనీ నిబద్ధతపై ఫాక్స్‌కాన్ టెక్నాలజీ గ్రూప్ చైర్మన్ యంగ్ లియు మార్చి 6న ప్రకటన చేసిన తర్వాత ఈ పరిణామం జరిగింది. అంతకుముందు, టి వర్క్స్‌ను ప్రారంభించేందుకు హైదరాబాద్‌కు వచ్చిన సందర్భంగా, యంగ్ లియు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుతో విస్తృతంగా సమావేశమయ్యారు. కొంగర కలాన్ పార్క్‌లో ఫాక్స్‌కాన్ ఒక లక్ష మందికి ప్రత్యక్ష ఉపాధి పొందేలా ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.

తైవాన్‌కు తిరిగి వచ్చిన వెంటనే, యంగ్ లియు కూడా తెలంగాణ అభివృద్ధికి BRS ప్రభుత్వం చేస్తున్న కృషిని అభినందిస్తూ ముఖ్యమంత్రికి లేఖ రాశారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles