33.2 C
Hyderabad
Tuesday, October 1, 2024

కొత్త పార్లమెంట్ వద్ద నిరసన తెలిపేందుకు ర్యాలీగా వెళ్లిన రెజ్లర్లపై ఎఫ్‌ఐఆర్ నమోదు!

న్యూఢిల్లీ: రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ను అరెస్ట్ చేయాలంటూ కొత్త పార్లమెంట్ భవనం వద్దకు నిరసన తెలిపేందుకు ర్యాలీగా వెళ్తున్న రెజ్లర్లను పోలీసులు ఆదివారం అరెస్టు చేసిన విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన జరిగిన కొన్ని గంటల తర్వాత ర్యాలీకి నాయకత్వం వహించిన పలువురు రెజ్లర్లపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

వివిధ సెక్షన్ల కింద వినేష్ ఫోగట్, సాక్షి మాలిక్, బజరంగ్ పునియాతో సహా పలువురు రెజ్లర్ల్‌పై కేసులు నమోదు చేసినట్లు దిల్లీ పోలీసులు తెలిపారు. కొంతమంది రెజ్లర్లు ఆదివారం రాత్రి జంతర్ మంతర్ వద్దకు వచ్చి నిరసన తెలిపారు. అయితే వారికి అనుమతిని పోలీసులు నిరాకరించినట్లు వెల్లడించారు. 

ఎఫ్‌ఐఆర్‌పై వినేష్ ఫోగట్ స్పందిస్తూ.. దేశం నియంతృత్వంలోకి వెళ్లిపోయిందా అని ట్విట్టర్ ద్వారా ప్రశ్నించారు.

రెజ్లర్లపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌‌పై వినేష్ ఫోగట్ స్పందించారు. లైంగిక వేధింపుల విషయంలో బ్రిజ్ భూషణ్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడానికి దిల్లీ పోలీసులు ఏడు రోజులు పడుతుందని, శాంతియుతంగా నిరసన చేపట్టినందుకు తమపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడానికి ఏడు గంటలు కూడా పట్టలేదన్నారు. దేశం నియంతృత్వంలోకి జారిపోయిందా? ప్రభుత్వం తమ ఆటగాళ్ల పట్ల ఎలా వ్యవహరిస్తుందో ప్రపంచం మొత్తం చూస్తోందని వినేష్ ఫోగట్ తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో మండిపడ్డారు.

పోలీసులు తనను కస్టడీకి తీసుకోవడంపై రెజ్లర్ భజరంగ్ పునియా కూడా స్పందించారు.

రెజ్లర్ బజరంగ్ పునియా కూడా పార్లమెంట్ వైపు వెళుతుండగా భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. వీధుల్లోకి రావడం తమ హక్కు అని నిరసనకారులు దీనిని ‘శాంతియుత’ మార్చ్‌గా పేర్కొన్నారు. పునియా కూడా ట్విట్టర్‌లో  పోలీసు కస్టడీని ప్రశ్నించారు.

“పోలీసులు నన్ను తమ కస్టడీలో ఉంచుకున్నారు. ఏమీ చెప్పడం లేదు. నేను ఏదైనా నేరం చేశానా? బ్రిజ్ భూషణ్ జైల్లో ఉండాల్సింది. మమ్మల్ని ఎందుకు జైల్లో ఉంచారు?” అని పునియా ప్రశ్నించారు.

నిరసనకారులపై అణిచివేత ప్రారంభించిన పోలీసులు జంతర్ మంతర్ నుండి టెంట్లను కూడా తొలగించి నిరసన స్థలాన్ని క్లియర్ చేశారు.

సెక్షన్ 147 (అల్లర్లకు పాల్పడినందుకు), సెక్షన్ 149 (చట్టవిరుద్ధమైన సమావేశానికి), 186 (పబ్లిక్ సర్వెంట్‌ను విధులను నిర్వర్తించకుండా అడ్డుకోవడం), 188 (ప్రభుత్వ సేవకుడు సక్రమంగా ప్రకటించిన ఉత్తర్వుకు అవిధేయత), 332 (స్వచ్ఛందంగా బాధ కలిగించడం) కింద కేసు నమోదు చేయబడింది. భారతీయ శిక్షాస్మృతి యొక్క 353 (ప్రభుత్వ సేవకుని తన విధిని నిర్వర్తించకుండా నిరోధించే నేర శక్తి) ప్రజా ఆస్తులకు నష్టం వాటిల్లకుండా నిరోధించే చట్టంలోని సెక్షన్ 3 కింద కూడా నిరసనకారులు అభియోగాలను ఎదుర్కొంటున్నారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles