28.2 C
Hyderabad
Tuesday, October 1, 2024

ఫ్లోరిడా తీరంలో పడవ బోల్తా… 39మంది గల్లంతు!

అమెరికా: ఫ్లోరిడా తీరంలో పడవ బోల్తా పడిన ఘటనలో 39 మంది గల్లంతైన వారి కోసం రెస్క్యూ బృందాలు వెతుకుతున్నాయని యుఎస్ కోస్ట్ గార్డ్ మంగళవారం ప్రకటించింది. ఇది మానవ అక్రమ రవాణా అని కోస్ట్ గార్డ్ అనుమానిస్తోంది. మంగళవారం ఉదయం ఫోర్ట్ పియర్స్ ఇన్‌లెట్‌కు తూర్పున 45 మైళ్ల దూరంలో బోల్తా పడిన 25 అడుగుల ఓడ అంచు పట్టుకొని వేలాడుతున్న వ్యక్తిని మంచి రక్షించడంతో మయామి కోస్ట్ గార్డ్ సెక్టార్ అప్రమత్తమైంది. డీహైడ్రేషన్ కారణంగా ఆ వ్యక్తి ఆసుపత్రిలో చేరినట్లు కోస్ట్ గార్డ్ ఒక ప్రకటనలో తెలిపింది. బహామాస్‌లోని బిమిని నుండి తాను మరియు మరో 39 మంది శనివారం రాత్రి బయలుదేరినట్లు జీవించి ఉన్న వ్యక్తి యుఎస్ కోస్ట్ గార్డ్‌కు చెప్పాడు. సముద్రంలో అల్లకల్లోలం కారణంగా నౌక బోల్తా పడింది… ప్రయాణికులు ఎవరూ లైఫ్ జాకెట్ ధరించలేదని ఆ వ్యక్తి తెలిపాడు. యూఎస్‘కోస్ట్ గార్డ్‘ మరియు వాయుసేన సిబ్బంది గల్లంతైన వ్యక్తుల కోసం చురుకుగా వెతుకుతున్నారు అని కోస్ట్ గార్డ్ ట్వీట్ చేసింది. మంగళవారం రాత్రి, దాని సిబ్బంది 1,300 చదరపు మైళ్లకు పైగా శోధించారని చెప్పారు. వలసదారులు యునైటెడ్ స్టేట్స్‌కు చేరుకోవడానికి చాలా కాలంగా బహామాస్ దీవులను రాచమార్గంగా ఉపయోగిస్తున్నారు, బిమిని దీవులు మయామికి తూర్పున 80కిమీ (50 మైళ్ళు) దూరంలో మాత్రమే ఉన్నాయి. ఈ ఘటనను అనుమానిత మానవ అక్రమ రవాణా కేసుగా పరిగణిస్తున్నట్లు కోస్ట్ గార్డ్ తెలిపింది.
స్మగ్లర్లు సాధారణంగా సముద్రాన్ని దాటేందుకు అనుకూల వాతావరణాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు, అయితే ఓడలు తరచుగా పరిమితికి మించి మనుషుల్ని ఎక్కించుకొని బోల్తాపడుతున్నాయి. ఇలాంటి దుర్ఘటనలో కారణంగా గత కొన్నేళ్లుగా వేల సంఖ్యలో మరణాలు సంభవించాయి. గత వారం ‘బిమిని‘ పశ్చిమాన పడవ బోల్తా పడిన ఘటనలో 32 మందిని అధికారులు రక్షించిన సంఘటన మరువక ముందే తాజా ప్రమాదం జరిగినట్లు కోస్ట్ గార్డ్ ప్రతినిధి, పెట్టీ ఆఫీసర్ జోస్ హెర్నాండెజ్ రాయిటర్స్ వార్తా సంస్థకు తెలిపారు. మొత్తంగాసరిహద్దు దాటేందుకు ప్రయత్నిస్తున్న వారిలో ఎక్కువమంది హైతీ, క్యూబా నుండి వస్తున్నారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles