24.2 C
Hyderabad
Tuesday, October 1, 2024

కరీంనగర్ డెయిరీలో విటమిన్ ఎ, డితో కూడిన ఫోర్టిఫైడ్ పాలు!

కరీంనగర్: కరీంనగర్ డెయిరీ వినియోగదారులకు  శుభవార్త వినిపించింది. ఈ డెయిరీలో నిన్న విటమిన్ ఎ, డితో కూడిన ఫోర్టిఫైడ్ పాలను కొత్త ప్యాకేజీల్లో విడుదల చేశారు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) ప్రమాణాల ప్రకారం… కరీంనగర్ డెయిరీ దాని అన్ని పాల పదార్థాల్లో విటమిన్ ఎ, డిని చేర్చింది. దీంతో సూక్ష్మపోషకాలను పొందడానికి అద్భుతమైన మార్గం లభించినట్లయింది. ఈ పాలు అన్ని వయసుల వారి పోషకాహార అవసరాలను తీర్చనున్నాయి.

రైతుల నుంచి కొనుగోలు చేసిన 24 గంటల్లోనే వినియోగదారులకు తాజా పాలను సరఫరా చేసే ఏకైక డెయిరీ కరిమ్‌నగర్ డెయిరీ. కొత్త ఫోర్టిఫైడ్ పాల ప్యాకెట్లు నాణ్యత, స్వచ్ఛత కూడిన ఆధునిక, ఆకర్షణీయమైన ప్యాకేజీలలో లభ్యం కానున్నాయి. కొత్త ప్యాకేజీలలో వచ్చే పాల ప్యాకెట్లు; టోన్డ్ మిల్క్, ప్యూర్ మిల్క్, గోల్డ్ మిల్క్, టీ-స్పెషల్, 200 ml, 500 ml, 1,000 ml మరియు లూస్ మిల్క్ క్యాన్‌ల వంటి విభిన్న పరిమాణాల్లో లభ్యం కానున్నాయి.

కరీంనగర్ డెయిరీ చైర్మన్ Ch రాజేశ్వర్ రావు రెండు కొత్త రకాల పాలను కూడా ప్రారంభించారు, 6 శాతం కొవ్వు కలిగిన ఘనీకృత పాలు, 9 శాతం SNF, (పాశ్చరైజ్డ్,హోమోజెనైజ్డ్), 4.5 శాతం కొవ్వు,  9 శాతం SNF కలిగిన ప్రత్యేక పాలు (STM) అందించనున్నారు. మొత్తంగా స్వచ్ఛత, పరిమాణానికి పేరుగాంచిన కరీంనగర్ డెయిరీ తాజా బలవర్ధక పాలను అందజేస్తున్న ఉత్పత్తులను వినియోగదారులు ఆదరించాలని ఈ సందర్భంగా చైర్మన్ పిలుపునిచ్చారు.

రాష్ట్రంలోనే కరీంనగర్ డెయిరీ అమ్మకాలు, కొనుగోళ్లలో ప్రథమ స్థానంలో నిలిచిందని, 1,230 గ్రామాల్లో లక్ష మంది రైతుల నుంచి పాలను సేకరించి 24 గంటల్లో వినియోగదారులకు అందజేస్తున్నామని చెప్పారు. వివిధ రకాల్లో కొత్తగా ప్యాక్ చేసిన పాలను కొనుగోలు చేయడం ద్వారా రాష్ట్రంలోని పాల ఉత్పత్తి చేసే రైతులను వినియోగదారులు ప్రోత్సహిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles