24.7 C
Hyderabad
Wednesday, October 2, 2024

‘ఛత్తీస్‌గఢ్‌’పై కేసీఆర్ దృష్టి…’జోగి కాంగ్రెస్‌’ను బీఆర్‌ఎస్‌లో విలీనం చేసే అవకాశం!

హైదరాబాద్: దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పార్టీని విస్తరించాలని ప్రయత్నిస్తున్న బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ఆదివాసీల ప్రాబల్యం ఉన్న ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో  జనతా కాంగ్రెస్ (జోగి) కన్నేసినట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి అజిత్ జోగి స్థాపించిన ఈపార్టీ  గులాబీ పార్టీలో విలీనం కానుంది.

మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ తర్వాత ఛత్తీస్‌గఢ్‌లో కూడా కేసీఆర్ దూసుకుపోవాలని చూస్తున్నారని పార్టీ నేతలు చెబుతున్నారు. ఇందుకు సంబంధించి అజిత్‌ జోగి కుమారుడు అమిత్‌ జోగి బీఆర్‌ఎస్‌ చీఫ్‌తో పలు దఫాలుగా సమావేశాలు జరిపినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. విలీనానికి ఆయన అంగీకరించినట్లు తెలిసింది. దీనికి సంబంధించిన ప్రకటన ఒకటి రెండు రోజుల్లో వెలువడే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

ఛత్తీస్‌గఢ్‌లోని దక్షిణ ప్రాంతంలో తెలంగాణ జిల్లాలతో సరిహద్దులుగా ఉన్న బస్తర్ వంటి ప్రాంతాల్లో జోగి కాంగ్రెస్‌కు కొంత పునాది ఉందని బీఆర్‌ఎస్ నేత ఒకరు తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌ నుంచి చాలా మంది పని కోసం తెలంగాణకు వస్తుంటారు. అక్కడివారిలో ఎక్కువ మందికి తెలుగు కూడా తెలుసు. పొరుగు రాష్ట్రంలో పార్టీ వ్యాప్తి చేయటం సులువుగా ఉంటుందని బీఆర్ఎస్ అధినేత చెప్పారు. విలీనం తర్వాత ఆ రాష్ట్రంలో బహిరంగ సభ కూడా నిర్వహించే అవకాశం ఉందన్నారు.

BRS నాయకుల ప్రకారం, ఇప్పటికే రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో జోగి కాంగ్రెస్‌కు కార్యకర్తల బలం ఉంది. ఈ పార్టీ  విలీనమైతే ఛత్తీస్‌గఢ్‌లో BRS వ్యాప్తికి సహాయపడుతుంది. 2018 ఎన్నికల్లో ఆ పార్టీ ఏడు సీట్లు గెలుచుకుంది. అయితే జోగి కాంగ్రెస్ మనుగడ కోసం పోరాడుతోందని ఆ వర్గాలు తెలిపాయి. అనేక మంది నాయకులు వివిధ రాజకీయ పార్టీల్లో చేరిపోయారు. ఫలితంగా ఆ పార్టీ పనితీరు సంవత్సరాలుగా క్షీణిస్తోంది. పార్టీ తన ఉనికిని కాపాడుకోవడానికి  BRS ఒక మాధ్యమంగా చూస్తోంది.

ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి జూన్ 21, 2016న జోగి కాంగ్రెస్‌ పార్టీని ప్రారంభించారు,  అదే రోజున అంటేఈ జూన్ 21న బీఆర్‌ఎస్‌లో విలీనంపై అమిత్ జోగి ప్రకటన చేయవచ్చని భావిస్తున్నారు. జూన్ 22 వరకు తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో బిజీగా ఉన్న తెలంగాణ సీఎం.. ఆ తర్వాత సరిహద్దు రాష్ట్రంలో పర్యటించనున్నారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles