24.2 C
Hyderabad
Tuesday, October 1, 2024

రైతు బంధు నిధులను నిలిపివేయవద్దు…బ్యాంకులను కోరిన రాష్ట్ర ప్రభుత్వం!

హైదరాబాద్: రైతుబంధు కింద రైతులకు అందించే వ్యవసాయ పెట్టుబడి సాయాన్ని బ్యాంకులు నిలిపివేయవద్దని తెలంగాణ ప్రభుత్వం  కోరింది. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్‌ఎల్‌బిసి) ద్వారా అన్ని బ్యాంకులకు ఈ మేరకు సమాచారం పంపించారు.

పంట రుణాల మంజూరు, రెన్యూవల్‌ను యథావిధిగా పరిగణించాలని బ్యాంకులను ఆదేశించింది. రుణమాఫీ మొత్తాన్ని దశలవారీగా రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇప్పటి వరకు 5,42,635 మంది రైతులకు రూ.1,207.37 కోట్లు రుణ ఖాతాల్లో జమ చేశారు.

రుణమాఫీ అమలు కోసం 2023-24లో రూ.6,385 కోట్ల బడ్జెట్‌ కేటాయింపులు జరిగాయి. అర్హులైన రైతుల రుణ ఖాతాలకు గడువులోగా మొత్తం జమ చేయనున్నారు.

రైతు బంధు పథకం

రైతు బంధు పథకం వ్యవసాయ రంగంలో ఓ విప్లవాత్మక మార్పు. తెలంగాణ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఈ పథకం ద్వారా రైతులకు పెట్టుబడి సాయం అందుతోంది. ఈ పథకం దేశానికే ఆదర్శంగా నిలిచింది. ఈ పథకం అమలును అనేక రాష్ట్రాలు ప్రశంసించాయి.

రుణ భారం నుండి రైతులను ఉపశమనం కలగడమే కాకుండా,  మళ్లీ అప్పుల ఉచ్చులో పడకుండా ఉండేందుకు, రైతు బంధు పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించింది. రూ. విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు వంటి ఇతర పెట్టుబడుల కొనుగోలు కోసం ఈ పథకాన్ని ఉద్దేశించారు.

రైతు బంధు పథకం… వ్యవసాయ ఉత్పాదకతను మెరుగుపరచడమే కాకుండా, రైతులకు ఆదాయాన్ని పెంచడానికి పెట్టుబడిగా ఉపయోగపడుతోంది. ఈ పథకం   గ్రామీణ రుణ భారంలో పడకుండా చూసుకోవటానికి, “వ్యవసాయ పెట్టుబడి సహాయ పథకం” (“రైతు బంధు”) లక్షలాది రైతులకు సాయపడుతోంది.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles