30.2 C
Hyderabad
Tuesday, October 1, 2024

తలసరి ఆదాయ వృద్ధిలో తెలంగాణ టాప్!

హైదరాబాద్: ఏ దేశమైనా, రాష్ట్రమైనా అభివృద్ధి చెందిందని చెప్పేందుకు తలసరి ఆదాయాన్నే గీటురాయిగా తీసుకుంటారు. దేశ, రాష్ట్ర అభివృద్ధి వేగానికి తలసరి ఆదాయ వృద్ధిరేటు ప్రధాన సూచీగా నిలుస్తుంది. అంతటి విశేష ప్రాధాన్యమున్న తలసరి ఆదాయ వృద్ధిలో 2022-23 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది.

తాజాగా పార్లమెంట్‌లో… గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ (MoSPI) విడుదల చేసిన  గణాంకాలను అనుసరించి ఈ విషయం వెల్లడైంది. రూ. 3,08,732 తలసరి ఆదాయంతో తెలంగాణ మిగతా రాష్ట్రాల కన్నా ముందుంది. ఆ తరువాతి స్థానాల్లో కర్ణాటక రూ. 3,01,673, హర్యానా రూ. 2,96,685 నిలిచాయి.

కోవిడ్ అనంతర కాలంలో… గత సంవత్సరాలతో పోలిస్తే తెలంగాణ తలసరి ఆదాయంలో గణనీయమైన పెరుగుదలను సాధించింది. 2020-21లో తెలంగాణ తలసరి ఆదాయం .2,25,687 రూపాయలు.  2021-22లో రాష్ట్రం రూ. 2,65,942  తలసరి ఆదాయాన్ని నమోదు చేసి, అన్ని ప్రధాన రాష్ట్రాలలో అగ్రగామిగా ఉంది. తద్వారా రాష్ట్రం వరుసగా రెండో ఆర్థిక సంవత్సరంలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. 2021-22లో తలసరి ఆదాయం రూ. 2,65,623తో కర్ణాటక  వెనుకబడి ఉంది.

స్థిరమైన ధరల ప్రకారం చూస్తే 2022-23లో రూ. 1,81,961 తలసరి ఆదాయంతో హర్యానా అగ్రస్థానంలో ఉంది. ఆ తరువాత కర్ణాటక రూ.1,76,383 , తలసరి ఆదాయం, తమిళనాడు రూ.1,66,463తో వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. 2022-23లో స్థిర ధరల వద్ద తెలంగాణ తలసరి రూ.1,64,657 నమోదు చేసింది.

తలసరి ఆదాయం అనేది ఒక రాష్ట్రం లేదా దేశంలోని నివాసితులు ఆర్జించే సగటు ఆదాయాన్ని ప్రతిబింబించే ముఖ్యమైన ఆర్థిక సూచిక. తెలంగాణ తలసరి ఆదాయంలో పెరుగుదల ఇటీవలి సంవత్సరాలలో రాష్ట్ర ఆర్థిక వృద్ధి గణనీయమైన ప్రగతి సాధించింది.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles