33.2 C
Hyderabad
Tuesday, October 1, 2024

రాష్ట్రంలో 1,520 మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్!

హైదరాబాద్: ప్రభుత్వ ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలను క్షేత్ర స్థాయిలో బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం నిన్న 1,520 మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ (మహిళ) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. తెలంగాణ స్టేట్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (MHSRB) రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌ను నిర్వహిస్తుంది.

అనుభవాన్ని బట్టి అభ్యర్థుల వేతనం రూ., 31,040 నుండి రూ., 92,050 వరకు ఉంటుంది. MPHA (మహిళలు) అభ్యర్థులు 100 పాయింట్ల ఆధారంగా ఎంపిక చేయబడతారు, అందులో 80 పాయింట్లు రాత పరీక్ష మరియు మిగిలిన 20 పాయింట్లు కాంట్రాక్ట్ మరియు ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కోసం రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రులు/సంస్థలు/ ప్రోగ్రామ్‌లలో సేవలకు అందించబడతాయి.

ఆన్‌లైన్ దరఖాస్తులు ఆగస్టు 25 ఉదయం 10.30 నుండి ప్రారంభవుతాయి.  (https://mhsrb.telangana.gov.in) సెప్టెంబర్ 19 సాయంత్రం 5గంటల లోపు  దరఖాస్తులను సమర్పించాలి.

1520 మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్‌లను నియమించడం ద్వారా పల్లెల్లో ప్రాథమిక ఆరోగ్య సంరక్షణను బలోపేతం చేయాలన్న ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు నిర్ణయాన్ని… ఆరోగ్య మంత్రి టి హరీష్‌రావు ప్రశంసించారు. ఆయన మాట్లాడుతూ “తెలంగాణలో ఆరోగ్యం, వైద్యం, కుటుంబ సంక్షేమంలో జాబ్ మేళా కొనసాగుతోంది. 1520 MPHA ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆశావహులందరికీ శుభం జరగాలని కోరుకుంటున్నానని ట్విట్టర్ ద్వారా అభిలషించారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles