30.2 C
Hyderabad
Tuesday, October 1, 2024

నుహ్-గురుగ్రామ్ కూల్చివేతలపై పంజాబ్, హర్యానా హైకోర్టు బెంచ్‌లో నేడు విచారణ!

న్యూఢిల్లీ: నుహ్, గురుగ్రామ్ కూల్చివేతలపై సుమోటోగా కేసును విచారిస్తున్న పంజాబ్, హర్యానా హైకోర్టు బెంచ్ నేడు ఈ కేసును విచారించనున్నట్లు ‘లైవ్‌లా’ నివేదించింది.  ఈ కేసును న్యాయమూర్తులు గుర్మీత్ సింగ్ సంధావాలియా, హర్‌ప్రీత్ కౌర్ జీవన్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది.

గత వారం హర్యానాలోని నుహ్ ప్రాంతంలో మత ఘర్షణలు చెలరేగడంతో కూల్చివేతలను నిలిపివేయాలని ఆగస్టు 8న హైకోర్టు ఆదేశించింది. ఇలా చేయడం  “జాతి ప్రక్షాళన” కాదా అని హైకోర్టు బెంచ్ ప్రశ్నించింది.

“ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా.. కూల్చివేత ఉత్తర్వులు ఇచ్చి, చట్టాన్ని అనుసరించకుండా భవనాలను కూల్చివేసేందుకు శాంతిభద్రతల సమస్యను ఒక సాకుగా ఉపయోగిస్తున్నారు” అని బెంచ్ పేర్కొంది.

ఈ కేసును ఇప్పుడు న్యాయమూర్తులు అరుణ్ పల్లి, జగ్‌మోహన్ బన్సాల్‌లతో కూడిన ధర్మాసనం విచారించనుందని లైవ్‌లా నివేదించింది.

రాష్ట్ర ప్రభుత్వం మతపరమైన హింసను విచారిస్తున్నందున బుల్డోజర్లు ఇలాజ్ (చికిత్స)లో భాగమని హర్యానా హోం మంత్రి అనిల్ విజ్ చేసిన వ్యాఖ్యపై హైకోర్టు ఆగస్టు 8 నాటి విచారణలో ఘాటైన వ్యాఖ్యను చేసిందని NDTV నివేదించింది.

రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసు జారీ చేసిన క్రమంలో…  “అధికారం అవినీతికి దారి తీస్తుంది, సంపూర్ణ అధికారం పూర్తిగా అవినీతిమయం చేస్తుందన్న” లార్డ్ ఆక్టన్ వ్యాఖ్యలను హైకోర్టు ఉటంకించింది.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles