31 C
Hyderabad
Tuesday, October 1, 2024

అసెంబ్లీ ఎన్నికలు…జోరుగా సాగుతున్న కొత్త వాహనాల కొనుగోలు!

హైదరాబాద్: త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ముహూర్తం దగ్గర పడ్డంతో  అభ్యర్థులు ఇప్పుడు కొత్త వాహనాల కొనుగోళ్లలో మునిగి తేలుతున్నారు.  తమ ఎన్నికల ప్రచారానికి ఉపయోగపడే అనువైన వాహనాలను కొనుగోలు చేయడంలో వారు పోటీ పడుతున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేలు  దాదాపు అర డజను వాహనాలను కొనుగోలు చేశారు. వీటిలో ఖరీదైన ల్యాండ్ క్రూయిజర్, డిఫెండర్ ఇతర కొత్త బ్రాండ్లు ఉన్నాయి.

గ్రామాలు, మండలాల్లో ఎన్నికల ప్రచారానికి కాన్వాయ్‌లో వెళ్లేందుకు కనీసం డజను కార్లు అవసరమని, ప్రచారానికి వెళ్లే ముందు బందోబస్తును బలోపేతం చేయాలని ఎమ్మెల్యేలు భావిస్తున్నారు.  నాగార్జున సాగర్ ఎమ్మెల్యే ఎన్ భరత్, తుంగతుర్తి ఎమ్మెల్యే జి కిషోర్ తాజా వెర్షన్ వాహనాలను కొనుగోలు చేసారు. వాటిని ఇప్పటికే నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ప్రచార ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నారు.

వీరిలో ఎక్కువ మంది ఎమ్మెల్యేలు హైదరాబాద్‌లోని కార్ షోరూమ్‌ల నుంచి కొత్త కార్ల కోసం ఆర్డర్లు ఇచ్చినట్లు సమాచారం. ఇందులో నాగర్‌కర్నూల్‌ ఎమ్మెల్యే ఎం. జనార్దన్‌రెడ్డి కూడా ఉన్నారు. ప్రచారం కోసం భారీ కార్ల కాన్వాయ్ ఉండాలని ఆయన ప్రతిపాదించారు. షోరూమ్‌ల ద్వారా ఈ వాహనాలను డెలివరీ చేసిన తర్వాత వారి వారి నియోజకవర్గాలకు తరలిస్తారు. సెప్టెంబరు నుంచి జోరుగా ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని, షోరూమ్‌లు కార్ల పంపిణీని వేగవంతం చేయాలని ఎమ్మెల్యేలు కోరారు.  భారత ఎన్నికల సంఘం ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేయగానే కొత్త కార్లను ఎన్నికల ఖర్చుగా పరిగణిస్తారని దీంతో ఎమ్మెల్యేలు వాహనాల కొనుగోలుకు హడావుడి చేస్తున్నారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles