24.7 C
Hyderabad
Tuesday, October 1, 2024

హైదరాబాద్‌లో ఆసియాలోనే అతిపెద్ద కూలింగ్ సిస్టమ్…1600 కోట్లు పెట్టుబడి పెట్టనున్న తబ్రీద్‌!

హైదరాబాద్: తెలంగాణలో పెట్టుబడులు ప్రవాహంలా వచ్చిపడుతున్నాయి. మొన్నటిమొన్న నాఫ్‌కో లాంటి మరిన్ని యుఏఈ సంస్థలు 1000 కోట్లకుపైగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. తాజాగా ప్రపంచ ప్రఖ్యాత శీతలీకరణ కార్యకలాపాల సంస్థ అయిన తబ్రీద్..  రాష్ట్రంలో రూ.1600 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. తద్వారా హైదరాబాద్ ఫార్మా సిటీతో సహా పారిశ్రామిక పార్కులలో శీతలీకరణ మౌలిక సదుపాయాలను ఉత్తమంగా అభివృద్ధి చేస్తామని తబ్రీద్ సంస్థ తెలిపింది. ఇందులో భాగంగా సంస్థ 1.25 లక్షల టన్నుల రిఫ్రిజిరేషన్‌ కూలింగ్‌ మౌలిక వసతులను తెలంగాణలో అభివృద్ధి చేయనుంది. ఇది ఆసియాలోనే అతిపెద్ద డిస్ట్రిక్ట్‌ కూలింగ్‌ ప్రాజెక్ట్‌ కానుంది.

ఈ మేరకు తబ్రీద్ సంస్థ రాష్ట్ర సర్కారుతో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దుబాయ్ పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్ సమక్షంలో సంస్థ ప్రతినిధులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఒప్పందంపై సంతకాలు చేశారు. దుబాయ్‌లో మంత్రి కేటీఆర్‌తో ఆ సంస్థ సీఈఓ ఖలీద్ అల్ మర్జు, ప్రతినిధి బృందం సమావేశం అయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ… తెలంగాణ ప్రభుత్వం పర్యావరణ హితం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టిందని  అన్నారు. అలాగే రాష్ట్రంలో భారీగా కొనసాగుతున్న పారిశ్రామికీకరణ, వేగంగా విస్తరిస్తున్న వ్యాపార వాణిజ్య ప్రాంతాలను దృష్టిలో ఉంచుకొని మంత్రి సస్టైనబుల్ భవిష్యత్తు కోసం ఈ అవగాహన ఒప్పందం ఎంతగానో ఉపకరిస్తుందని చెప్పారు. ఇలాగే ఈ డిస్ట్రిక్ కూలింగ్ సిస్టమ్ 6,800 గిగా వాట్ల శక్తిని, 41,600 మెగా లీటర్ల నీటిని, 6.2 మిలియన్ టన్నుల కార్బన్ డై ఆక్సై్‌ను ఆదా చేస్తుందని మంత్రి అన్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో జరిగిన ఈ అవగాహన ఒప్పందం తెలంగాణ రాష్ట్ర మాత్రమే కాకుండా భారత దేశ సస్టైనబుల్ ఇన్ఫ్రాస్ట్రక్టర్ రంగంలో ఒక మైటరాయిగా నిలిచిపోతుందని సంస్థ చైర్మన్ ఖాలిద్ అబ్దుల్లా అల్ ఖుబాసి తెలిపారు. తమ సంస్థకు డిస్ట్రిక్ట్ కూలింగ్ రంగంలో ఉన్న అపారమైన అనుభవము సాంకేతిక పరిజ్ఞానాన్ని తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక అవసరాల కోసం ఉపయోగిస్తామని అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద కాలుష్య రహిత ఫార్మసిటికల్ క్లస్టర్ హైదరాబాద్ ఫార్మాసిటీతో పాటు తెలంగాణ రాష్ట్రంలోని ఇతర పారిశ్రామిక పార్కులు, వాణిజ్య అవసరం అయినా అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానం కలిగిన తమ కూలింగ్ టెక్నాలజీలను.. అందిస్తామన్నారు.

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సస్టెయినబుల్‌ కూలింగ్‌ విధానంపై యూఎన్‌ పర్యావరణ కార్యక్రమం ఇండియా హెడ్‌ అతుల్‌ బగాయి ప్రశంసలు కురిపించారు.

ఎంఒయు సంతకాల కార్యక్రమంలో తబ్రీద్ సంస్థ సిఇఒ ఖలీద్ అల్ మర్జూఖీ నేతృత్వంలోని తబ్రీద్ సీనియర్ నాయకత్వ బృందంతో పాటు పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి  జయేష్ రంజన్, హైదరాబాద్ ఫార్మా సిటీ లిమిటెడ్ సిఇఒ శక్తి ఎం నాగప్పన్, తబ్రీద్ కంట్రీ మేనేజర్ – ఇండియా సుధీర్ పెర్ల కూడా పాల్గొన్నారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles