28.2 C
Hyderabad
Tuesday, October 1, 2024

సింగరేణి లాభాల్లో కార్మికులకు 32 శాతం వాటా…. సీఎం కేసీఆర్!

హైదరాబాద్: సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ లాభాల్లో 32 శాతం బొగ్గు కార్మికులకు బోనస్‌గా ఇవ్వాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి‌ నుండి లాభాల్లో కార్మికులకు అందించే వాటాను ప్రతి ఏడాది పెంచుతూ, బొగ్గు గని కార్మికులకు దేశంలోనే అత్యధికంగా దసరా కానుక అందిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది.

ఈ మేరకు 2022-23 ఆర్థిక సంవత్సరానికి గానూ కంపెనీ ఉద్యోగులకు ప్రత్యేక ప్రోత్సాహకంగా SCCL (పన్ను తర్వాత) ఆర్జించిన లాభంలో 32 శాతాన్ని ఇచ్చేలా ఉత్తర్వులు జారీ చేయాలని ప్రధాన కార్యదర్శి ఎ శాంతికుమారిని  ముఖ్యమంత్రి కార్యాలయం ఆదేశించింది.

సీఎం కేసీఆర్ ప్రకటన తరువాత, రాష్ట్రంలోని 11 ప్రాంతాలలో బొగ్గు కార్మికులు సంబరాల్లో మునిగిపోయారు. BRS MLC తెలంగాణ బొగ్గు ఘనీ కార్మిక సంఘం (TBGKS) గౌరవ అధ్యక్షురాలు కె.కవిత బొగ్గు కార్మికుల తరపున ముఖ్యమంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ట్వీట్ చేశారు. ప్రతి సంవత్సరం కార్మికులకు ఇస్తున్న లాభాల వాటాను ముఖ్యమంత్రి పెంచుతూ బొగ్గు కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తున్నారని ఆమె అన్నారు.

11వ వేజ్ బోర్డు బకాయిలను సింగరేణి యాజమాన్యం గత వారంలో సింగరేణి కార్మికులకు రూ.1450 కోట్లు జమ చేసింది.  కార్మికులకు వాళ్ల వాళ్ల సర్వీస్‌ సీనియారిటీని బట్టి నగదు జమ అయింది. ఒక్కో కార్మికుడికి ఏరియర్స్‌ రూపంలో దాదాపు రూ.3.70 లక్షల వరకు క్రెడిట్‌ అయ్యింది. ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బు రావడంతో… కార్మికులు సంతోషానికి అవదులు లేవు. కార్మికులు, వారి కుటుంబ సభ్యులు సంతోషంలో మునిగిపోయారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles