24.2 C
Hyderabad
Tuesday, October 1, 2024

తెలంగాణను అవమానించినందుకు ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్!

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును పదే పదే అవమానిస్తున్నారని, కృష్ణా నదీ జలాల పంచుకునే కీలక అంశాన్ని ప్రధాని నరేంద్ర మోదీ నిర్లక్ష్యం చేస్తున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు మండిపడ్డారు. తెలంగాణ ప్రజలను అగౌరవపరిచేలా చేసిన వ్యాఖ్యలకు మోదీ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు.

ప్రధాని మోదీ తెలంగాణకు వస్తున్న సమయంలో ప్రశ్నలు సంధిస్తామని చెప్పారు. తెలంగాణపై ప్రధాని ఎందుకు విషం చిమ్ముతున్నారు? తెలంగాణ పుట్టుకను ఎందుకు అవమాన పరుస్తారు? అని ప్రశ్నించారు. అమృతకాలంలో పార్లమెంట్ సమవేశాల్లో తెలంగాణపై విషం చిమ్ముతారా అని నిలదీశారు.

పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ ఏర్పాటును అవమానించిన ప్రధాని మోదీ…రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలని మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. హైదరాబాద్ తెలంగాణ భవన్ లో మంత్రి కేటీఆర్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. పార్లమెంట్ లోనే కాకుండా అనేక సందర్భాల్లో ప్రధాని మోదీ తెలంగాణ ఏర్పాటును కించపరిచారని మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని అగౌరవించడం అంటే రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిన వేలాది అమరులతో పాటు తెలంగాణలో ఉన్న నాలుగు కోట్ల ప్రజలను అవమానించినట్టేనని వ్యాఖ్యానించారు.

తెలంగాణకు 575 టీఎంసీల కృష్ణా నదీ జలాల పంపకంలో   న్యాయమైన కేటాయింపులు జరగాలన్నారు. రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి గత తొమ్మిదేళ్లలో మోడీ ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించడంలో విఫలమైందని, ఇది తెలంగాణ ప్రజలకు ముఖ్యంగా రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాల ప్రజలకు నష్టం కలిగించిందని ఆయన అన్నారు.

అసలు మహబూబ్‌నగర్ జిల్లాలో అడుగు పెట్టే నైతిక హక్కు ప్రధాని మోదీకి లేదన్నారు. అక్టోబర్ 1న ప్రధాని మహబూబ్‌నగర్‌లో పర్యటించనున్నారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles