23.7 C
Hyderabad
Tuesday, October 1, 2024

వృద్ధులకు ఇంటి వద్దనే ఓటు…రంగారెడ్డి జిల్లాలో మిశ్రమ స్పందన!

రంగారెడ్డి: ఈ సారి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో వంద శాతం ఓటింగ్‌ లక్ష్యంగా… రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) 80 ఏండ్లు పైబడిన వృద్ధులకు ఇంటినుంచే ఓటు హక్కు కల్పించిన విషయం తెలిసిందే. ఈ వెసులుబాటు  రంగారెడ్డి జిల్లా ప్రజల నుంచి మిశ్రమ స్పందనను రేకెత్తిస్తోంది. ఎన్నికల సంఘం (EC) చర్యను ఓటర్లలో ఒక వర్గం స్వాగతిస్తున్నప్పటికీ, వారిలో ఎక్కువ మంది దీనిని అమలు చేయడంలో పారదర్శకతపై ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ విషయంపై రంగారెడ్డి జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి హరీష్ విలేకరుల సమావేశంలో  మాట్లాడుతూ… “80 ఏళ్ల వయస్సు పైబడిన వృద్ధులు, వికలాంగ ఓటర్లను ఇంటి నుండి ఓటు వేయడానికి అనుమతించాలని SEC నిర్ణయం తీసుకుంది”. ఈ ఓటర్లు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఐదు రోజుల్లోగా 12-డి ఫారమ్‌ను నింపి సంబంధిత బూత్ లెవల్ ఆఫీసర్లకు (BLO) అందజేయాలి” అని ఆయన సూచించారు.

రంగారెడ్డి జిల్లాలో లక్ష మందికి పైగా వికలాంగులు నివసిస్తున్నారు, ఈ జిల్లా భౌగోళికంగా దక్కన్ పీఠభూమి మధ్య భాగంలో ఉంది.. 5,031 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. జిల్లాలో మొత్తం 33,56,056 మంది ఓటర్లలో 80-90 ఏళ్ల మధ్య వయస్సు గల ఓటర్లు 36,669 మంది ఉన్నారు. అదే విధంగా  90-99 ఏళ్లలోపు 6,336 మంది ఓటర్లు, 100-109 ఏళ్లలోపు ఓటర్లు 371 మంది, 110-119 ఏళ్ల మధ్య వయస్సు గల ఆరుగురు ఓటర్లు ఉన్నారు. .

జిల్లాలో మొత్తం 33,56,056 మంది ఓటర్లు నమోదు చేసుకోగా, రంగారెడ్డిలో 3,369 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు. జిల్లాలో అక్టోబర్ 9 నుంచి ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చి డిసెంబర్ 5 వరకు కొనసాగుతుంది. వృద్ధులు, వికలాంగులు తొలిసారిగా ఇంటి వద్ద నుంచే ఓటు వేసేందుకు ఈసీ తీసుకున్న చర్యను స్వాగతిస్తున్నట్లు తెలంగాణ వికలాంగుల సంక్షేమ సంఘం (టీడీడబ్ల్యూఎస్) అధ్యక్షుడు సయ్యద్ అఫ్రోజ్ తెలిపారు. అంతేకాదు వృద్ధులు, వికలాంగులు పోలింగ్ బూత్‌ల వద్ద పొడవైన క్యూలలో నిరీక్షణ తప్పుతుందని ఆయన అన్నారు.

అయితే ఎన్నికల సంఘం తీసుకున్న ఈ విధానం అమలుపై సామాజిక కార్యకర్తలు సందేహాలు లేవనెత్తారు. ఈ సందర్భంగా ఓ సామాజిక కార్యకర్త మాట్లాడుతూ, “మొత్తం ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేయాలని అన్నారు. ఈ పరిణామంతో  స్థానిక నాయకులు బీఎల్‌ఓలపై ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంది. చాలా మంది BLOలు సాధారణంగా స్థానిక రాజకీయ నాయకులతో సంబంధాలు ఉంటాయి. అది వృద్ధ ఓటర్ల ప్రాణాలను పణంగా పెట్టవచ్చు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles