26.7 C
Hyderabad
Tuesday, October 1, 2024

ఇజ్రాయెల్ దురాక్రమణ పాలస్తీనియన్ల స్వీయ-నిర్ణయ హక్కును ఉల్లంఘిస్తుంది…మలేషియా!

అంకారా: పాలస్తీనాకు స్వయం నిర్ణయాధికారం ఉందని, ఇజ్రాయెల్ ఆక్రమణ కారణంగా ఈ హక్కు ఉల్లంఘనకు గురైందని మలేషియా గురువారం అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసిజె) విచారణ సందర్భంగా తేల్చి చెప్పింది.

ఆక్రమిత పాలస్తీనా భూభాగాల్లో ఇజ్రాయెల్ జరుపుతున్న దమనకాండపై నెదర్లాండ్స్ పరిపాలనా రాజధాని హేగ్‌లోని పీస్ ప్యాలెస్‌లో ఈ విచారణలు జరుగుతున్నాయి.

ఈ సందర్భంగా మలేషియా తరపున విదేశాంగ మంత్రి మొహమ్మద్ హసన్ మాట్లాడుతూ.. అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించినందున ఆక్రమణ చట్టవిరుద్ధమని, దీనిని తక్షణమే ముగించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు.

పాలస్తీనాలోని దురాక్రమణ, వివక్షాపూరిత విధానాలపై న్యాయమైన తీర్పును అందించడంలో ఈ అభిప్రాయం సహకరిస్తుందని, పాలస్తీనా ప్రజల స్వయం నిర్ణయాధికారంపై ICJ తన అభిప్రాయాలను వ్యక్తపరచడం తప్పనిసరి అని హసన్ అన్నారు.

అంతర్జాతీయ చట్టం, ఆక్రమణ చట్టం, విలీనాన్ని నియంత్రించే చట్టాలు…ఆక్రమిత భూభాగాల్లో అక్రమ స్థావరాలను బలవంతంగా ఏర్పాటు చేయడం వంటి చర్యలన్నీ పాలస్తీనా ప్రజల స్వయం నిర్ణయాధికారాన్ని మరింత ఉల్లంఘిస్తున్నాయని మంత్రి హసన్ ఎత్తి చూపారు.

గాజాపై ఇజ్రాయెల్ విధించిన దిగ్బంధనం ద్వారా స్థానిక జనాభా ప్రాథమిక అవసరాలను కోల్పోతుందని, ఇజ్రాయెల్ వాదనల ఆధారంగా కొన్ని దేశాలు ఆర్థిక సహాయాన్ని నిలిపివేయడం వల్ల సవాళ్లను ఎదుర్కొంటున్న పాలస్తీనా శరణార్థుల కోసం UN ఏజెన్సీ లేదా UNRWAకి నిరంతర మద్దతు ఇవ్వాలని ఆయన పేర్కొన్నారు.

“పాలస్తీనా ప్రజలకు స్వయం నిర్ణయాధికారంపై హసన్ మాట్లాడుతూ… ఆక్రమణను అంతం చేయడంతో పాటు, ఇజ్రాయెల్  దురాక్రమణ ద్వారా  పాలస్తీనాకు వాటిల్లిన నష్టాలకు పరిహారం చెల్లించాలని అన్నారు.

మారిషస్ తరపున UNలో మారిషస్ శాశ్వత ప్రతినిధి జగదీష్ D. కూంజుల్ మాట్లాడుతూ… ఇజ్రాయెల్ దురాక్రమణను అంతం చేసి, పాలస్తీనా ప్రజలకు స్వయం నిర్ణయాధికారం కల్పించాల్సిన అవసరాన్ని ఎత్తిచూపారు.

చాగోస్ ద్వీపసమూహం నిర్మూలనలో ICJ పాత్రను ప్రస్తావిస్తూ, ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య ఇదే విధమైన చర్చల ప్రక్రియను ప్రారంభించడానికి సంప్రదింపుల ప్రాముఖ్యతను కూంజుల్ హైలైట్ చేశారు.

రెండు-దేశాల మధ్య నెలకొన్న సమస్యల పరిష్కారంపై  కూంజుల్ మాట్లాడుతూ…“ నిజానికి, శాశ్వత శాంతిని తీసుకురాగల ఏకైక పరిష్కారం ఇదే. పాలస్తీనియన్లు తమ సొంత దేశంలో స్వేచ్ఛగా జీవించాలని మేము నమ్ముతున్నాము. అదనంగా, పాలస్తీనా దేశంగా గుర్తించడానికి అవసరమైన అన్ని అర్హతలను కలిగి ఉందని మేము విశ్వసిస్తాము.

బ్రస్సెల్స్  ఫ్రీ యూనివర్శిటీలో అంతర్జాతీయ న్యాయశాస్త్ర ప్రొఫెసర్ అయిన పియరీ క్లైన్, పాలస్తీనా భూభాగాలపై ఇజ్రాయెల్ దీర్ఘకాల ఆక్రమణపై మాట్లాడుతూ… “విలీనం”గా మారిన ఆక్రమణ చట్టవిరుద్ధమని నొక్కి చెప్పారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles