24.2 C
Hyderabad
Tuesday, October 1, 2024

నా పార్టీ మీ డిగ్రీ లాంటిది కాదు…ప్రధాని మోదీకి కౌంటర్ ఇచ్చిన ఉద్ధవ్ ఠాక్రే!

పాల్ఘర్ (మహారాష్ట్ర): శివసేన (యుబిటి) చీఫ్ ఉద్ధవ్ థాకరే  ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ‘నకిలీ శివసేన’ వ్యాఖ్యపై మండిపడ్డారు. మా పార్టీ ‘మీ డిగ్రీ’ లాంటిది కాదని ఎద్దేవా చేశారు.

తన పార్టీ పాల్ఘర్ లోక్‌సభ నియోజకవర్గ అభ్యర్థి భారతీ కమ్డి గెలుపు నిమిత్తం ముంబై సమీపంలోని బోయిసర్‌లో జరిగిన ప్రచార ర్యాలీలో థాకరే మాట్లాడుతూ… ప్రతిపక్ష ఇండియా కూటమి 300 మార్కును దాటుతుంది, బిజెపిని ఓడిపోతుందని జోస్యం చెప్పారు. స్థానిక మత్స్యకారులు వ్యతిరేకిస్తున్న పాల్ఘర్ జిల్లాలోని వధావన్ పోర్ట్ ప్రాజెక్ట్‌ను కూడా రద్దు చేస్తానని ఆయన ప్రతిజ్ఞ చేశారు.

గుజరాత్‌కు మంచి ప్రాజెక్టులు తీసుకెళుతున్నారని, మహారాష్ట్రలో పర్యావరణ విధ్వంసక ప్రాజెక్టులు ప్రవేశపెడుతున్నారని కేంద్ర ప్రభుత్వం, బీజేపీపై  ఠాక్రే విరుచుకుపడ్డారు. పాల్ఘర్‌లో కొత్త విమానాశ్రయాన్ని నిర్మిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

ప్రధాని నరేంద్ర మోది చేసిన నకిలీ శివసేన ఆరోపణలపై శివసేన, (ఉద్ధవ్) పార్టీ చీప్ ఉద్ధవ్ ఠాక్రే కౌంటర్ ఇచ్చారు. మరాఠా భూమి పుత్రుల హక్కుల కోసం పోరాడటానికి దివంగత నేత బాలా సాహేబ్ ఠాక్రే శివసేన పార్టీని స్థాపించారని అన్నారు.

లోక్సభ ఎన్నికల ప్రచారంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇటీవల మహారాష్ట్రలోని ర్యాలీలో పాల్గొని ఉద్దర్ (శివసేన) పై విమర్శలు చేశారు. ఉద్ధవ్ శివసేన.. నకిలి శివసేన పార్టీ అని అన్నారు. ‘ప్రతిపక్ష ఇండియా కూటమికి చెందిన భాగస్వామ్య పార్టీ డీఎంకే సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియాతో పోల్చింది. కాంగ్రెస్, నకిలీ శివసేన (ఉద్దస్) కూడా మహారాష్ట్రలో ర్యాలీల్లో ఇలాంటి వ్యాఖ్యలే చేస్తున్నారు’ అని ప్రధాని మండిపడ్డారు.

“మా పార్టీని రెండుగా చీల్చిన వాడు ఒక పార్టీ ఫేక్ అంటున్నాడు. ఎవరు నకిలీ, ఎవరు నిజమో మహారాష్ట్ర ప్రజలే  మహారాష్ట్ర ప్రజలు నిర్ణయిస్తారని అన్నారు.

ఇక.. 2022లో శివసేన పార్టీ రెండుగా చీలిపోయిన విషయం తెలిసింది. ఎక్ నాథ్ పిండే పలువురు రెబల్ ఎమ్మెల్యేలు, బీజేపీతో కలిసి సభుత్వాన్ని ఏర్పాటు చేసి సీఎం అయ్యారు. అతనితోపాటు వచ్చిన కొందరికి మంత్రి పదవులు కూడా కేటాయించారు. అసలైన శివసేన పార్టీ తమదంటే తమదని ఉద్దవ్, పిండే వర్గాలు వీటిషన్లు వేశాయి. దీంతో కోర్టు అనుమతిలో ఏక్ నాద్ పిండి వర్గమే అసలైన శివసేన అని స్పీకర్ ప్రకటించారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles