24.2 C
Hyderabad
Tuesday, October 1, 2024

నుమాయిష్ మళ్ళీ ప్రారంభం… ఫిబ్రవరి 20నుంచే ఎగ్జిబిషన్ !

హైదరాబాద్: కరోనా  మహమ్మారి కారణంగా అర్ధాంతరంగా నిలిచిపోయిన అఖిల భారత పారిశ్రామిక వస్తు ప్రదర్శన నుమాయిష్‌  (ఎగ్జిబిషన్‌) ను మళ్లీ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.. నాంపల్లి  ఎగ్జిబిషన్‌ మైదానంలో ఈ ఏడాది జనవరి 1న గవర్నర్‌ తమిళి సై సౌందరరాజన్‌ ఈ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు. అయితే అదే రోజు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన కరోనా మార్గదర్శకాలకు అనుగుణంగా జనవరి 2న రాత్రే ఈ ఎగ్జిబిషన్‌ను మూసేశారు. అయితే కరోనా శాంతించడంతో మళ్లీ నుమాయిష్‌ ఎగ్జిబిషన్‌ను పునఃప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఎగ్జిబిషన్‌ సొసైటీ మేనేజింగ్‌ కమిటీ సభ్యులు బుధవారం నుమాయిష్‌ నిర్వహణపై ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేశారు. ఇందులో కమిటీ సభ్యులతో సహా వివిధ శాఖల ప్రభుత్వాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫిబ్రవరి 20 నుంచి ఎగ్జిబిషన్‌ను మళ్లీ ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులు సొసైటీ కమిటీ సభ్యులకు సూచించినట్లు సమాచారం. కరోనా నిబంధనలు, ఆంక్షల మేరకు మార్చి ఆఖరి వరకు ఎగ్జిబిషన్‌ కొనసాగేలా చర్యలు తీసుకోవాలని అధికారులు కోరారు. దీంతో ఎగ్జిబిషన్ సొసైటీ ప్రతినిధులు ఎగ్జిబిషన్ ను ఫిబ్రవరి 20 నుంచి ప్రారంభించి మార్చి నెలాఖరు వరకు నిర్వహించేలా చర్యలు చేపడుతున్నారు. సొసైటీ తరఫున అవసరమైన ఏర్పాట్లన్నీ పూర్తి చేశామని, స్టాళ్ల నిర్వాహకులకు ఆహ్వానాలు పంపుతున్నట్టు సీనియర్ సభ్యుడు ఒకరు మీడియాకు తెలిపారు. ఎగ్జిబిషన్ ప్రారంభానికి ప్రభుత్వంలోని అన్ని శాఖలు అనుమతులు ఇచ్చినప్పటికీ, ఆలస్యమైతే 25వ తేదీ నుంచి పూర్తిస్థాయిలో ప్రారంభించుకోవచ్చని సూచించినట్లు పేర్కొన్నారు. నగర సీపీ సీవీ ఆనంద్ సైతం ఎగ్జిబిషన్ నిర్వహణకు అనుమతి ఇచ్చిన్పటికీ అధికారికంగా రెండో రోజుల్లో అనుమతిని మంజూరు చేస్తామని చెప్పినట్లు సొసైటీ ప్రతినిధులు పేర్కొన్నారు.

 

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles