30.2 C
Hyderabad
Tuesday, October 1, 2024

నవ్వి…నవ్వి స్పృహ కోల్పోయిన వ్యక్తి… ఆసుపత్రిలో చేరాక కుదుటపడ్డ వైనం!

హైదరాబాద్: నవ్వు ఒక రోగం కాదు నవ్వు ఒక బోగం.. నవ్వు ఫ్రీ… ఎంతైనా నవ్వుకోవచ్చు. ఎంత నవ్వితే అంత లాభం. నవ్వడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. వ్యాపారాల బిజీలో పడి చాలామంది నవ్వుకు దూరమవుతున్నారు. ఇలాంటి వారు కడుపుబ్బా నవ్వితే సమస్యలు కూడా తీరిపోతాయట. నవ్వు ఒత్తిడిని తగ్గించే ఒక మెడిసిన్ అన్నటి ఒకప్పటి మాట. అయితే నవ్వు నాలుగు విధాలా గ్రేట్‌కాదు…నవ్వు నాలుగు విధాలా చేటు తెస్తుందని ఈ స్టోరీ చదివితే తెలుస్తుంది.

ఇక వివరాల్లోకి వెళ్తే…  53 ఏళ్ల హైదరాబాదీ వ్యక్తి నవ్వు ఆపుకోలేక స్పృహ కోల్పోవడంతో ఇటీవల  ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. స్థానిక నివేదికల ప్రకారం, ఓ వ్యక్తి తన ఇంట్లో కామెడీ షో చూస్తున్నాడు. అతను టీ తాగుతున్నప్పుడు విపరీతంగా నవ్వడం మొదలుపెట్టాడు.

హఠాత్తుగా  అతని చేతిలో టీ పడిపోయింది.  అతను తన కుర్చీలో నుండి పడిపోయి స్పృహ కోల్పోయాడు. అయినా నవ్వుతూనే ఉన్నాడు. అతని చేతులు వణకడం ప్రారంభించాయి. ఈ హాటాత్పరిణామాన్ని అక్కడే ఉన్న ఆ వ్యక్తి కూతురు గమనించి కుటుంబసభ్యులను అప్రమత్తం చేసింది.

ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఐసీయూలో చేర్చాల్సి వచ్చింది. కాసేపటి తర్వాత ఆ వ్యక్తి స్పృహలోకి వచ్చాడు.  కాళ్లు, చేతులు కదిలించగలిగాడు. మాటలు కూడా వచ్చేశాయి. అయితే ఆ సంఘటన గురించి అతనికి జ్ఞాపకం లేదు.

వైద్యులు, అతని వైద్య చరిత్రను పరిశీలించిన తర్వాత, తదుపరి పరీక్షల కోసం హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో న్యూరాలజిస్ట్ డాక్టర్ సుధీర్‌కు రిఫర్ చేశారు.

ఆసుపత్రిలో, డాక్టర్ సుధీర్ ఈ ఎపిసోడ్ అంతా విన్న తర్వాత, నవ్వడం కారణంగా అతనికి మూర్ఛ వచ్చిందని నిర్ధారించారు.

విపరీతంగా నవ్వడం, ఎక్కువసేపు నిలబడటం, అధిక శారీరక శ్రమ చేయొద్దని డాక్టర్ సుధీర్ అతనికి సూచించారు.

నవ్వు-కారణంగా మూర్ఛ రావడం అనేది ఒక అరుదైన వైద్య పరిస్థితి, దీనిలో ఒక వ్యక్తి ఎక్కువగా నవ్వడం వల్ల తాత్కాలికంగా స్పృహ (సింకోప్) కోల్పోతాడు. ఈ పరిస్థితి రక్తపోటులో అకస్మాత్తుగా తగ్గుదల లేదా మెదడుకు రక్త ప్రసరణలో తాత్కాలిక తగ్గింపు కారణంగా సంభవిస్తుంది, ఇది మూర్ఛకు దారితీస్తుంది.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles