33.2 C
Hyderabad
Tuesday, October 1, 2024

లోక్‌సభ తొలిరోజే ఎమర్జెన్సీపై మోదీ, ఖర్గే మధ్య మాటల యుద్ధం!

న్యూఢిల్లీ: లోక్‌సభ  సమావేశాలు తొలిరోజే వాడివేడిగా మొదలయ్యాయి. 1975లో ఎమర్జెన్సీ విధించడంపై ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్‌ చీఫ్‌ మల్లికార్జున్‌ ఖర్గే మధ్య వాగ్యుద్ధం నడిచింది.  ఇందిరాగాంధీ హయాంలో విధించిన ఎమర్జెన్సీ దేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఓ మచ్చ అని ప్రధాని మోదీ విమర్శించగా.. గత పదేండ్లలో దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తుందని ప్రతిపక్ష కాంగ్రెస్‌ ప్రధానికి పంచ్ ఇచ్చింది. .

అంతకు ముందు లోక్‌సభ ప్రారంభ సెషన్‌లో ప్రధానమంత్రితో సహా కొత్తగా ఎన్నికైన మొత్తం 262 మంది ఎంపీలు ప్రమాణ స్వీకారం చేసారు. మిగిలిన కొత్త ఎంపీలు మంగళవారం ప్రమాణ స్వీకారం చేయనుండగా, స్పీకర్ పదవికి బుధవారం ఎన్నిక జరగనుంది.

కాగా ఎంపీగా ప్రధాని మోదీ ప్రమాణం చేసే సమయంలో విపక్ష సభ్యులు రాజ్యాంగం పుస్తకాలు చేతిలో పట్టుకొని నిలబడ్డారు.  “ప్రజాస్వామ్యాన్ని రక్షించండి” అని నినాదాలు చేస్తూ, రాజ్యాంగం కాపీలను ప్రదర్శించారు.

మొత్తంగా 18వ లోక్‌సభ సమావేశాలను ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌పై విమర్శలతో ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ప్రభుత్వం విధించిన ఎమర్జెన్సీని ప్రస్తావించారు. ‘‘భారత ప్రజాస్వామ్యానికి మాయని మచ్చలాంటి అత్యవసర పరిస్థితి విధించి నేటికి 50 ఏళ్లు.. భారత రాజ్యాంగ్యాన్ని ఎలా రద్దు చేశారో? దేశాన్ని జైలుగా మార్చి ప్రజాస్వామ్యాన్ని ఎలా ఖూనీచేశారో కొత్త తరం మర్చిపోదు.. దేశంలో అటువంటి ఘటనలు ఇంకెప్పుడూ పునరావృతం కాదని వాగ్దానం చేస్తున్నాను’’ అని మోదీ అన్నారు.

మూడోసారి అధికారంలోకి వచ్చిన తమ ప్రభుత్వం మూడు రెట్లు కష్టపడి ఫలితాలను అందిస్తుందని ప్రజలకు హామీ ఇచ్చారు. స్వాతంత్య్రం అనంతరం వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చిన రెండో ప్రభుత్వం తమదేనని, ఇది ఎంతో ప్రత్యేకమైందని అన్నారు.

ఓడినా అహంకారం మిగిలిపోయింది: ఖర్గే
ప్రధాన మంత్రి సాధారణ ప్రసంగం కంటే ఎక్కువసేపు ప్రసంగించారని ” నైతికంగా,  రాజకీయంగా ఓడినా తర్వాత కూడా మోదీలో అహంకారం మిగిలిపోయింది” అని ఖర్గే అన్నారు.

“నరేంద్ర మోదీ జీ, మీరు ప్రతిపక్షాలకు సలహా ఇస్తున్నారు. మీరు మాకు 50 ఏళ్ల ఎమర్జెన్సీని గుర్తు చేస్తున్నారు, కానీ గత 10 సంవత్సరాల అప్రకటిత ఎమర్జెన్సీని ప్రజలు మర్చిపోయారు, దాన్ని ప్రజలు అంతం చేసారు, ”అని కాంగ్రెస్ అధ్యక్షుడు ‘X’ పోస్ట్‌లో పేర్కొన్నారు.

నినాదాల వ్యాఖ్యలపై ఖర్గే స్పందిస్తూ…
“ప్రజలు మోడీకి వ్యతిరేకంగా తమ తీర్పు ఇచ్చారు. అయినప్పటికీ, అతను ప్రధానమంత్రి అయితే, అతను పని చేయాలి, ”అని ఖర్గే అన్నారు, అతను ముఖ్యమైన సమస్యలపై ఏదైనా చెబుతారని దేశం ఆశిస్తున్నదని అన్నారు.

ప్రజలకు కావాల్సింది చర్చలే తప్ప నినాదాలు కాదన్న ప్రధాని మాటలను గుర్తుచేసుకున్న ఖర్గే, ఈ విషయాన్ని తనకు తాను గుర్తు చేసుకోవాలని అన్నారు.

రాజ్యాంగాన్ని పరిరక్షించాలన్న తమ ప్రయత్నానికి ప్రజలు మద్దతు పలికారని ఖర్గే తెలిపారు. పార్లమెంటు లోపల, వెలుపల ప్రజల గొంతును ఇండియా కూటమి పెంచుతుందన అన్నారు. నీట్ చుట్టూ జరుగుతున్న నిరసనలు, పశ్చిమ బెంగాల్లో రైలు ప్రమాదం, మణిపూర్‌లో కొనసాగుతున్న హింస గురించి ప్రధాని మాట్లాడితే బాగుంటుందని ఖర్గే అన్నారు.

రాజ్యాంగాన్ని మార్చేందుకు ప్రధానిని అనుమతించనని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు.
బలమైన ప్రతిపక్షం రాజ్యాంగాన్ని అన్నివిధాలా కాపాడుతుందని పేర్కొన్నారు. ప్రజల గొంతును పెంచుతుంది. ప్రధానమంత్రి జవాబుదారీతనం లేకుండా తప్పించుకోవడానికి అనుమతించదని రాహుల్ అన్నారు.”

 

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles