33.2 C
Hyderabad
Tuesday, October 1, 2024

యూపీ, ఉత్తరాఖండ్, గోవాలో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్!

న్యూఢిల్లీ:  ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా రెండో విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉత్తరప్రదేశ్‌లో రెండో దశలో తొమ్మిది జిల్లాల్లో విస్తరించి ఉన్న యాభై ఐదు నియోజకవర్గాలకు, గోవా 40 స్థానాలకు,   ఉత్తరాఖండ్ 70 స్థానాలకు నేడు ఎన్నికలు జరిగాయి. గోవా, ఉత్తరాఖండ్‌లలో ఒకే విడతలో పోలింగ్‌ పూర్తయింది. యూపీ రెండో దశ పోలింగ్  9 జిల్లాల్లోని 55 అసెంబ్లీ యూపీలోని 55 స్థానాల్లో 60.44 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు.   గోవాలో రికార్డు స్థాయిలో 79 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. ఉత్తరాఖండ్‌లో 65.1% ఓటింగ్‌ నమోదైనట్టు ఎన్నికల సంఘం వెల్లడించింది.
రాజకీయంగా ప్రాధాన్యత కలిగిన యుపిలో బిజ్నోర్, సంభాల్ మరియు సహరాన్‌పూర్ జిల్లాల్లోని ఎనిమిది సున్నితమైన నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక్కడ సమాజ్‌వాదీ పార్టీకి కంచుకోటలుగా భావించే ప్రాంతాలలో గణనీయమైన ముస్లిం జనాభా ఉంది.
త్తరప్రదేశ్‌లోని 55 సీట్లలో 2017లో బీజేపీ 38, సమాజ్‌వాదీ పార్టీ 15, కాంగ్రెస్ 2 గెలుచుకున్నాయి.
ఈ దశలో పోటీ చేస్తున్న ప్రముఖులలో సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నాయకుడు ఆజం ఖాన్, సమాజ్ వాదీ పార్టీలోకి మారిన బిజెపి మంత్రి ధరమ్ సింగ్ సైనీ మరియు రాష్ట్ర ఆర్థిక మంత్రి సురేష్ ఖన్నా ఉన్నారు.  జైలులో ఉన్న ఎస్పీ నాయకుడు ఆజంఖాన్ రాంపూర్ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఆజంఖాన్ కుమారుడు అబ్ధుల్లా ఆజం కూడా స్వార్ సీటు నుంచి ఎన్నికల బరిలో నిలిచారు. ఈ దశలో మొత్తం 4,917 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మకంగా గుర్తించిన అధికారులు.. కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.

ఉత్తరాఖండ్‌‌లో ముక్కోణ పోటీ

70 అసెంబ్లీ సీట్లున్న ఉత్తరాఖండ్‌‌లో నేడు పోలింగ్ జరుగుతోంది. 632మంది అభ్యర్థులు బరిలో ఉండగా, వీరిలో 152 మంది ఇండిపెండెంట్లు పోటీ చేస్తున్నారు. మొత్తం 81 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. పోలింగ్ ఉదయం 8 నుంచి సాయంత్రం 6 దాకా కొనసాగనుంది. సీఎం ధామి, మంత్రులు సత్పాల్ మహారాజ్, సుబోధ్ ఉనియాల్, అర్వింద్ పాండే, ధన్ సింగ్ రావత్, రేఖా ఆర్య, బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ మదన్ కౌశిక్.. కాంగ్రెస్ నుంచి మాజీ సీఎం హరీశ్ రావత్, ఆ పార్టీ స్టేట్ చీఫ్ గణేశ్ గొడియాల్ తదితరులు బరిలో ఉన్నారు. గత ఎన్నికల్లో బీజేపీ 57 సీట్లు గెలుచుకుని అధికారాన్ని దక్కించుకుంది. కాంగ్రెస్ కు11 సీట్లు, ఇండిపెండెంట్లు 2 సీట్లు గెలుచుకున్నారు. గత ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్యే పోరు నడవగా.. ఈ సారి ఆమ్ ఆద్మీ పార్టీ రేసులోకొచ్చింది. ఇక్కడ ముక్కోణపు పోటీ నెలకొంది.

గోవా కేవలం 40 సీట్లు మాత్రమే ఉన్న చిన్న సముద్రతీర రాష్ట్రమైనప్పటికీ, యూపీ తర్వాత గోవా అసెంబ్లీ ఎన్నికలు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. 2017లో  కాంగ్రెస్ అత్యధిక స్థానాలను గెలుచుకుంది, కానీ గోవాలో BJP ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈసారి, అరవింద్ కేజ్రీవాల్  ఆమ్ ఆద్మీ పార్టీ, మమతా బెనర్జీ… తృణమూల్ కాంగ్రెస్ కూడా పోటీలో ఉన్నాయి, ఢిల్లీ,  బెంగాల్ దాటి తమ పాదముద్రను విస్తరించాలనే ఆశతో ఈ రెండు పార్టీలు ఉన్నాయి.  బీజేపీ తిరుగుబాటుదారుడు, దివంగత మనోహర్ పారికర్ కుమారుడు ఉత్పల్ పారికర్ ఇండిపెండెంట్‌గా బీజేపీకి చెందిన అటానాసియో మోన్సెరేట్‌పై పోటీ చేస్తున్న పనాజీ నియోజకవర్గం యావత్ దేశం దృష్టిని ఆకర్షిస్తోంది. కాంగ్రెస్ మాజీ బ్యూరోక్రాట్ మరియు 2017లో ఆప్ ముఖ్యమంత్రి అభ్యర్థి అయిన ఎల్విస్ గోమ్స్‌ను రంగంలోకి దింపింది. ఆప్ మూడోసారి వాల్మీకి నాయక్‌ను రంగంలోకి దించింది.  గోవాలో తృణమూల్ కాంగ్రెస్ దూకుడు మీదుంది.  2017 ఎన్నికల్లో గోవాలో సీట్లు గెలవని ఆమ్ ఆద్మీ పార్టీ ఈసారి బాగానే సిద్ధమైందని పేర్కొంది.

గోవాలో ఓటేసినోళ్లకు డిస్కౌంట్లు : ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు గోవాలో వినూత్న ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు ఓటు వేసి వచ్చిన వాళ్లకు కాఫీ షాపులు, హోటళ్లు, బంగీ జంపింగ్, హాట్ ఎయిర్ బెలూన్ రైడ్లపై ప్రత్యేక తగ్గింపులు ఇస్తామని ప్రకటించారు. పోలింగ్, వాలెంటైన్స్‌‌ డే ఒకటే రోజు రావడంతో నార్త్ గోవాలోని 30 హోటళ్ల యజమానులు ఫుడ్ ఆర్డర్లపై భారీ డిస్కౌంట్లు ప్రకటించారు.  కాగా ఈ మూడు రాష్ట్రాల్లో మార్చి 10న ఫలితాలు వెలువడనున్నాయి.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles