25.2 C
Hyderabad
Monday, September 30, 2024

మంత్రి నిర్మలా సీతారామన్‌పై  సిఐడి విచారణ కోరుతూ  కోర్టును ఆశ్రయించిన బెంగళూరు పోలీసులు!

బెంగళూరు: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో పాటు ఇతర బీజేపీ నేతలపై కేసును సీఐడీకి బదిలీ చేయాలని బెంగళూరు పోలీసులు కోర్టును ఆశ్రయించారు.  నిర్మలా సీతారామన్… డిపార్ట్‌మెంట్ ఎలక్టోరల్ బాండ్ల పేరుతో డబ్బు వసూలు చేసిందని జనాధికార్ సంకాష్ సంస్థ తరపున ఆదర్శ్ అయ్యర్ అనే వ్యక్తి ఆరోపించారు. అన్ని పత్రాలను పరిశీలించిన తర్వాత బెంగళూరులోని ప్రత్యేక కోర్టు దేశ ఆర్థిక మంత్రిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని తిలక్‌నగర్ పోలీస్ స్టేషన్‌ను ఆదేశించిన విషయం తెలిసిందే.

బెంగళూరు కోర్టు కేసు నమోదు చేయాలని ఆదేశించిన మరుసటి రోజు… మంత్రి నిర్మల, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు, బిజెపి ఆఫీస్ బేరర్లు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బివై విజయేంద్ర, సీనియర్ నాయకుడు నళిన్ కుమార్ కటీల్‌లపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. కేసును CIDకి బదిలీ చేయడానికి కోర్టు అనుమతిని కోరేందుకు చర్చలు జరుగుతున్నాయని ఉన్నత స్థాయి పోలీసు వర్గాలు  మీడియాకు తెలిపారు.

ఈ విషమై తదుపరి చర్యలపై చర్చించడానికి డిప్యూటీ కమిషనర్  ఆఫ్ పోలీస్ సారా ఫాతిమా… అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్, తిలక్ నగర్ పోలీస్ ఇన్‌స్పెక్టర్‌తో సమావేశమయ్యారు. కేసు తీవ్రత, అంతర్రాష్ట్ర పరిణామాలు, ఆరోపణల లోతును అంచనా వేసిన అధికారులు కేసును సీఐడీకి బదిలీ చేసేందుకు అనుమతి కోసం కోర్టును ఆశ్రయించారు.

“సాధారణంగా, కేసులను రాష్ట్ర పోలీసు చీఫ్ CIDకి సూచిస్తారు. అయితే, ఈ కేసులో, కోర్టు ఎఫ్‌ఐఆర్ దాఖలు చేయాలని ఆదేశించింది. దర్యాప్తు బాధ్యతను తిలక్ నగర్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ కు అప్పగించింది. అందువల్ల, కేసులో ఏదైనా మార్పు చేయాలంటే, కోర్టు అనుమతి తప్పనిసరి” అని పోలీసు వర్గాలు తెలిపాయి.

పోలీసులు కేసును దర్యాప్తు చేయడంలో ఉన్న ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని, ఈ కేసును సీఐడీకి బదిలీ చేయాలని పోలీసు అధికారులు కోరారు

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles