23.7 C
Hyderabad
Tuesday, October 1, 2024

2026 కల్లా భారత్​లో 100 కోట్ల ‘స్మార్ట్‌ ఫోన్‌’ యూజర్లు… డెలాయిట్‌ నివేదికలో వెల్లడి!

న్యూఢిల్లీ: దేశీయంగా స్మార్ట్‌ఫోన్ల అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. ఈ అమ్మకాల్లో పెరుగుదలకు కారణం గ్రామీణ ప్రాంతాలేనని అధ్యయనాలు చెబుతున్నాయి. పల్లెల్లో స్మార్ట్‌ ఫోన్ల వినియోగం విపరీతంగా పెరిగింది. దీనితో వచ్చే అయిదేళ్లలో స్మార్ట్‌ఫోన్‌ వాడకందార్ల సంఖ్య ఏకంగా 100 కోట్లకు చేరనుందని డెలాయిట్‌ కన్సల్టెన్సీ సంస్థ నివేదికలో వెల్లడించింది. 2021 గణాంకాల ప్రకారం దేశీయంగా 120 కోట్ల మొబైల్‌ యూజర్లు ఉండగా.. వీరిలో 75 కోట్ల మంది స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారులు ఉన్నారు. వచ్చే అయిదేళ్లలో భారత్‌ ప్రపంచంలోనే అత్యధికంగా స్మార్ట్‌ఫోన్లు తయారు చేసే రెండో దేశంగా నిలవనుంది.
భారతదేశంలో స్మార్ట్‌ఫోన్ డిమాండ్ గ్రామీణ మార్కెట్‌లో 6 శాతం వార్షికవృద్ధినమోదవుతుందని, పట్టణ మార్కెట్లో 2.5 శాతం వార్షికవృద్ధితో 2026లో దాదాపు 400మిలియన్ స్మార్ట్‌ ఫోన్లు విక్రయిస్తారని నివేదిక పేర్కొంది. ఇ-లెర్నింగ్, ఫిన్‌టెక్ ఇ-హెల్త్
యాప్‌లకు డిమాండ్‌ పెరగడంతో గ్రామీణ మార్కెట్‌లో ఇంటర్నెట్ సేవలకు డిమాండ్ ఎక్కువగా ఉంది. భారత్‌నెట్ ప్రోగ్రామ్ కింద 2025 నాటికి అన్ని గ్రామాలను ఫైబర్‌గా మార్చాలనే ప్రభుత్వప్రణాళికతో గ్రామీణ మార్కెట్‌లోని ఇంటర్నెట్- పరికరాలకు డిమాండ్‌ పెరుగవచ్చు.
2026 నాటికి పట్టణ ప్రాంతాల్లో సెకండ్‌ హ్యాండ్‌ ఫోన్లను కొనే వారి సంఖ్య 5 శాతానికేపరిమితం కావచ్చని 95 శాతం మంది తమ పాత ఫోన్ల స్థానంలో కొత్త స్మార్ట్‌ఫోన్లను కొనుక్కునేందుకే ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉందని డెలాయిట్‌ నివేదికలో తెలిపింది. 5జీ సర్వీసుల కారణంగా స్మార్ట్‌ఫోన్లకు ప్రధానంగా డిమాండ్‌ నెలకొనే అవకాశం ఉంది.దాదాపు 80 శాతం అమ్మకాలకు (సుమారు 31 కోట్ల యూనిట్లు) ఇదే ఊతంగా నిలవనుంది. హై–స్పీడ్‌ గేమింగ్, మారుమూల ప్రాంతాలకు కూడా వైద్య సేవలు అందించడం వంటి వివిధ రకాల అవసరాలకు ఉపయోగపడే 5జీ టెక్నాలజీ.. మిగతా మొబైల్‌ సాంకేతికలతో పోలిస్తే అత్యంత వేగంగా ప్రాచుర్యంలోకి వచ్చే అవకాశం ఉందని డెలాయిట్‌తెలిపింది. ఒక్కసారి 5జీ సర్వీసులను ఆవిష్కరిస్తే .. 2026 నాటికి స్మార్ట్‌ఫోన్‌ల అమ్మకాలు మొత్తం మీద అదనంగా 13.5 కోట్ల స్థాయిలో ఉండవచ్చని పేర్కొంది.
‘2022–26 మధ్యకాలంలో మొత్తం స్మార్ట్‌ఫోన్‌ల అమ్మకాలు 170 కోట్లకు చేరే అవకాశం ఉంది. దీనితో ఈమార్కెట్‌ 250 బిలియన్‌ డాలర్లకు చేరనుంది. అయిదేళ్ల వ్యవధిలో 84 కోట్ల పైచిలుకు 5జీపరికరాలు అమ్ముడు కానున్నాయి‘ అని డెలాయిట్‌ వివరించింది. 2022-26 మధ్యకాలంలో 250 బిలియన్‌ డాలర్ల (రూ.18.75 లక్షల కోట్లు) విలువైన170 కోట్ల స్మార్ట్‌ఫోన్లు భారత్‌లోకి దిగుమతవుతాయి. అందులో 84 కోట్లు 5జీ ఫోన్లే ఉంటాయి.
సెమీకండక్టర్లు, ఎల్రక్టానిక్స్‌ తయారీలో భారత్‌ ప్రాంతీయంగా పటిష్టమైన హబ్‌గా ఎదుగుతుందని అంచనా వేస్తున్నట్లు డెలాయిట్‌ ఇండియా పార్ట్‌నర్‌ పీఎన్‌ సుదర్శన్‌ తెలిపారు. ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన ప్రోత్సాహక ప్యాకేజీ ఫలితంగా దేశంలో ఫోన్ల
తయారీ మరింతగా పెరుగుతుందని డెలాయిట్ నివేదికలో వెల్లడైంది.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles