23.7 C
Hyderabad
Tuesday, October 1, 2024

భారత్‌లో ఈ ఏడాది 40 శాతం మంది ఉద్యోగాలు మారనున్నారు…క్వాల్ట్రిక్స్ సంస్థ అధ్యయనం!

హైదరాబాద్: దేశంలో జాబ్ మార్కెట్ భిన్నమైన పథంలో పయనిస్తోందని, కొత్త సర్వే ప్రకారం ఈ ఏడాది దాదాపు 40 శాతం మంది కార్మికులు ఉద్యోగాలు మారాలని చూస్తున్నారు. క్వాల్ట్రిక్స్ సంస్థ అధ్యయనం ప్రకారం దేశంలోని దాదాపు 40 శాతం మంది కార్మికులు ఈ సంవత్సరం ఉద్యోగాలు మారుతున్నారని సమాచారం. ఇది ప్రపంచ సగటు కన్నా… దక్షిణాసియాలోని చాలా దేశాల కంటే కూడా ఎక్కువ కావడం విశేషం. దాదాపు 60 శాతం మంది ఉద్యోగులు ఇంటి (హైబ్రిడ్) పనికి అలవాటు పడిన కారణంగా … ఆఫీసులు వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌కు స్వస్తి పలికి తిరిగి ఆఫీసులు రమ్మని బలవంతం చేస్తే కొత్త ఉద్యోగం కోసం వెతుకుతారని అధ్యయనంలో తేలింది. ఇది ప్రపంచ సగటు 35 శాతం కంటే దాదాపు రెట్టింపు. భారతదేశంలోని ఉద్యోగుల విషయానికొస్తే కేవలం 12శాతం ఉద్యోగులు మాత్రమే రాబోయే సంవత్సరంలో పాత ఆఫీసుల్లో పనిచేయడానికి ఆసక్తి చూపడం గమనార్హం. క్వాల్ట్రిక్స్ సంస్థ 2022 ఎంప్లాయీ ఎక్స్‌పీరియన్స్ ట్రెండ్స్ నివేదిక ప్రకారం… ఉద్యోగుల్లో వర్క్‌ ఫ్రం హోం (హైబ్రిడ్) అత్యంత ప్రజాదరణ పొందింది. దీంతో మూడు రోజులు రిమోట్/ఆఫీస్‌లో రెండు రోజులు, తర్వాత నాలుగు రోజులు రిమోట్/ఆఫీస్‌లో ఒకరోజు పనిచేసేందుకు ఉద్యోగులు మొగ్గుచూపుతున్నారని ఈ అధ్యయనం తేల్చింది.
భారత్‌ లాంటి పోటీతత్వం ఎక్కువగా ఉన్న దేశంలో ఉద్యోగి తన నైపుణ్యాలు మెరుగుపరచడానికి ప్రాధాన్యతనివ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కంపెనీలు “ఉద్యోగుల శ్రేయస్సుకు ప్రాధాన్యతనివ్వడం, స్వంతంగా ఎదిగేందుకు అవకాశాలు కల్పించడం, ఉద్యోగులు తమ కెరీర్ లక్ష్యాలను చేరుకోగలమని భావించడంతో ఉద్యోగులు స్వదేశంలో ఉండాలనే భావనకు మద్దతు దొరుకుతోందని అధ్యయనం తేల్చింది. హైబ్రిడ్‌కు మారడం వల్ల ఎదురయ్యే సవాళ్లను విజయవంతంగా అధిగమించడానికి భారతదేశంలోని కంపెనీలు కొత్త ఆలోచనలను అనుసరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రజలు విభిన్న అంశాల ఆధారంగా కెరీర్ నిర్ణయాలు తీసుకుంటున్నారు. అంటే క్వాల్ట్రిక్స్ వంటి అధ్యయన సంస్థల విశ్లేషణలను సులభంగా గుర్తించి వాటికి అనుగుణంగా తమ నైపుణ్యాలకు పదునుపెడుతున్నారని భారతదేశంలో క్వాల్ట్రిక్స్ కోసం ఎంప్లాయీ ఎక్స్‌పీరియన్స్ సొల్యూషన్స్ స్ట్రాటజిస్ట్ లారెన్ హంటింగ్‌టన్ అన్నారు. క్వాల్ట్రిక్స్ అధ్యయనం ఆగష్టు – సెంబర్ 2021 మధ్య నిర్వహించారు. భారతదేశంలోని పరిశ్రమల శ్రేణిలో 18 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ సర్వీసు ఉండి ఫుల్‌టైం పనిచేస్తున్న 1,024 మంది ఉద్యోగులు ఈ సర్వేలో పాల్గొన్నారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles