24.2 C
Hyderabad
Tuesday, October 1, 2024

ఈ వేసవి చాలా ‘హాట్‌’ గురూ… భారత వాతావరణ శాఖ అంచనా!

న్యూఢిల్లీ: ఈ ఏడాది వేసవిలో వడగాలుల తీవ్రత ఉండవొచ్చని భారత వాతావరణ కేంద్రం పేర్కొన్నది. ఈ నెలలో పగటి ఉష్ణోగ్రతలు 37 నుంచి 40 సెల్సియస్‌ డిగ్రీల వరకు నమోదు కావొచ్చని తెలిపింది. ఏప్రిల్‌లో 40 నుంచి 45 డిగ్రీలు, మే నెల నుంచి జూన్‌ మొదటి వారం వరకు  దాదాపు 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.
ఈ వేసవిలో అక్కడక్కడా అకాల వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని, గాలిదుమారాలు కూడా రావొచ్చని చెప్పారు. ముఖ్యంగా పశ్చిమ-మధ్య, వాయువ్య భారతదేశంలోని కొన్నిప్రాంతాలలో వడగాల్పులలు ఎక్కువగా ఉండొచ్చని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇండో-గంగా మైదాన (ఉత్తర మధ్య భారతం) ప్రాంతాల్లో ఉష్ణోగ్రత తక్కువగా నమోదయ్యే అవకాముంది. అందువల్ల వడగాలుల ప్రభావం తక్కువగా ఉంటుంది.
2022 మార్చి నుండి మే వరకు కనిష్ట ఉష్ణోగ్రత వాయువ్య, పశ్చిమ, ఈశాన్య భారతదేశం, తూర్పు తీరంలోని చాలా ప్రాంతాలలో సాధారణం కంటే ఎక్కువగా ఉంటుందని భారత వాతావరణ శాఖా అంచనా వేసింది. అయితే తూర్పు భారతదేశం, మధ్యప్రదేశ్‌లోని ఉత్తర భాగాలు, ద్వీపకల్పభారతదేశంలోని అంతర్గత, దక్షిణ భాగాలు. పశ్చిమ బెంగాల్ దక్షిణ భాగం నుండి నైరుతి ఉత్తర ప్రదేశ్ వరకు సాధారణ ఉష్ణోగ్రత ఉండొచ్చని అంచనా.
ఐఎండీ గణాంకాల ప్రకారం… భారతదేశంలోని చాలా ప్రాంతాలు, ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. దక్షిణ ద్వీపకల్పంలోని అనేక ప్రాంతాల్లో సాధారణం నుండి సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉంది. పసిఫిక్ మరియు హిందూ మహాసముద్రాలపై సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత పరిస్థితుల్లో మార్పులు భారతీయ వాతావరణాన్ని ప్రభావితం చేస్తాయని తెలిసింది. దీంతో ఐఎండీ ఈ సముద్ర బేసిన్‌లపై సముద్ర ఉపరితల పరిస్థితుల పరిణామాన్ని జాగ్రత్తగా పర్యవేక్షిస్తుంది. దీని ప్రకారం, ప్రస్తుతం, భూమధ్యరేఖ పసిఫిక్ ప్రాంతంలో లా నినా పరిస్థితులు నెలకొని ఉన్నాయి. లా నినా ఉత్తర అర్ధగోళ వసంత కాలంలో బలహీనపడే అవకాశం ఉంది. 2022 రెండవ త్రైమాసికంలో ఎల్‌నినో తటస్థ స్థితికి చేరుకుని కాస్త చల్లబడే అవకాశముంది.
అసలు 2016 నుండి ఐఎండీ దేశంలోని వేడి, శీతల వాతావరణ సీజన్లలో కాలానుగుణ హెచ్చరికలను జారీ చేస్తోంది. ఈ అంచనాలు మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్స్ యొక్క మాన్‌సూన్ మిషన్ ప్రాజెక్ట్ కింద అభివృద్ధి చేయబడిన మాన్‌సూన్ మిషన్ కపుల్డ్ ఫోర్‌కాస్టింగ్ సిస్టమ్ (MMCFS) మోడల్‌పై ఆధారపడి ఉన్నాయి. గత సంవత్సరం 2021, ఐఎండీ దేశంలోని వర్షపాతం, ఉష్ణోగ్రత యొక్క నెలవారీ గణాంకాలను జారీ చేయడానికి కొత్త వ్యూహాన్ని అనుసరించింది. ఈ కొత్త వ్యూహం కొత్తగా అభివృద్ధి చేయబడిన మల్టీ-మోడల్ సమిష్టి (MME) ఆధారిత అంచనా వ్యవస్థపై ఆధారపడింది.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles