33.2 C
Hyderabad
Tuesday, October 1, 2024

ఫేస్​బుక్​పై సోనియా, రాహుల్ ధ్వజం…. ప్రజాస్వామ్యానికి ప్రమాదం అంటూ ఫైర్‌!

న్యూఢిల్లీ: ఫేస్​బుక్ వంటి సామాజిక మాధ్యమాలు దేశ ప్రజాస్వామ్యంలో జోక్యం చేసుకుంటున్నాయని కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. రాజకీయ పార్టీల ప్రచారాల విషయంలో ఫేస్​బుక్ పక్షపాతం వహిస్తోందని లోక్​సభలో పేర్కొన్నారు.
ఫేస్​బుక్ సహా ఇతర సోషల్ మీడియా సంస్థలు భారత ప్రజాస్వామ్యంలో జోక్యం చేసుకుంటున్నాయని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ధ్వజమెత్తారు. ఈ వ్యవస్థీకృత జోక్యానికి అంతం పలకాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. లోక్​సభలో జీరోఅవర్ సందర్భంగా మాట్లాడిన సోనియా.. ఎన్నికల అడ్వర్టైజ్​మెంట్​ల కోసం భాజపాకు ఫేస్​బుక్ తక్కువ ధరకే డీల్స్ కుదిర్చిందని సోనియా ఆరోపించారు. పలు అంతర్జాతీయ పత్రికా కథనాలను ఉటంకిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్యంలో ఫేస్​బుక్ వంటి సామాజిక మాధ్యమ సంస్థల వ్యవస్థీకృత జోక్యానికి ప్రభుత్వం చరమగీతం పాడాలి. అధికారంలో ఎవరు ఉన్నా ప్రజాస్వామ్యాన్ని, సామాజిక సామరస్యాన్ని కాపాడాలి.” అని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పేర్కొన్నారు.

కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ సైతం ఫేస్ బుక్ (Facebook) పై తీవ్రమైన ఆరోపణలు చేశారు.  సామాజిక మాధ్యమాలు..  ప్రజాస్వామ్యాన్ని అధ్వాన్నంగా మారుస్తున్నాయన్నారు. ఈ రోజు రాహుల్ గాంధీ తన ట్విటర్ ఖాతా (Twitter Account) వేదికగా పలు వ్యాఖ్యలు చేశారు. ఫేస్ బుక్ ప్రధానంగా అసత్య నివేదికలను ప్రచారం చేస్తుందని మండిపడ్డారు . అదే విధంగా, ఎన్నికల ఫలితాల నివేదికలలో.. కూడా పలు అసత్య క్యాంపెయినింగ్  చేసిందని ఆరోపించారు. ప్రధానంగా భారతీయ జనతా పార్టీకి ఫేస్ బుక్.. తక్కువ ధరలకు ప్రకటనలు ఇస్తుందని అన్నారు.
ల్ జజీరా, రాయటర్స్  ఇతర నివేదికల  ప్రకారం.. బీజేపీకి ఫేస్ బుక్ తక్కువ ధరలకు ప్రకటనలను ఆఫర్ చేసిందని అన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా.. దేశంలో మితిమీరిన అసత్య ప్రచారాలు  వైరల్ అవుతున్నాయని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇవి ప్రజాస్వామ్యాన్ని ప్రభావితం చేస్తున్నాయన్నారు.
దే విధంగా పక్షపాత రాజకీయాలకు తెరదీస్తున్నారని ఆరోపించారు. కొన్ని రాజకీయ పార్టీలకు కొమ్ము కాస్తు, వాటికి అనుగుణంగా, నివేదికలు ఇస్తున్నాయని విమర్శించారు. అదే విధంగా లేనివి.. ఉన్నట్లుగా ప్రచారం చేస్తున్నారని అన్నారు. దీని వలన ప్రజలు తప్పుదొవ పడుతున్నారని అన్నారు. ప్రజాస్వామ్యం (Democracy) అపహాస్యం పాలవుతుందని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అధికారం అనేది శాశ్వతం కాదని రాహుల్ గాంధీ అన్నారు. ఎవరు అధికారంలో ఉన్న.. ప్రజాస్వామ్యాన్ని, సామాజిక సామరస్యాన్ని కాపాడు కోవాలని హితవు పలికారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles