24.7 C
Hyderabad
Tuesday, October 1, 2024

బీజేపీపై మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఫైర్‌… ధైర్యముంటే జైల్లో పెట్టండి!

ముంబై: మహావికాస్‌ ఆఘాడీ(ఎంవీఏ) కూటమి నేతలతో పాటు, తన కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకొని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.. కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతున్నదని మహారాష్ట్ర సీఎం ఉద్దవ్‌ ఠాక్రే మండిపడ్డారు. తన బావమరిది శ్రీధర్‌ మాధవ్‌కు చెందిన ఆస్తులను ఈడీ జప్తు చేయడంపై శుక్రవారం ఆయన అసెంబ్లీ వేదికగా స్పందించారు. అధికారం కోసం బీజేపీ దుర్మార్గపు చర్యలకు పాల్పడుతున్నదని మండిపడ్డారు. ‘మీరు అధికారంలోకి వచ్చేందుకు మమ్మల్ని జైల్లో పెట్టాలనుకుంటే.. ముందు ‘నన్ను జైల్లో పెట్టండి’ అని సవాల్‌ విసిరారు.
“మీ బెదిరింపులకు నేను భయపడను. అధికారం కోసం ఇంత దుర్మార్గంగా ప్రవర్తించకండి. మమ్మల్ని లేదా మా కుటుంబ సభ్యులను వేధించకండి. మేము మిమ్మల్ని, మీ కుటుంబ సభ్యుల్ని ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు.” అని థాకరే అన్నారు.
మంత్రి నవాబ్‌ మాలిక్‌కు దావూద్‌తో సంబంధాలు ఉంటే, కేంద్ర దర్యాప్తు సంస్థలు ఇన్నేండ్లుగా ఏం చేస్తున్నాయని ప్రశ్నించారు. దావూద్‌ ఇబ్రహీంతో మాలిక్‌ డీల్‌కు సంబంధించిన వివరాలు ఈడీకి ఇచ్చానని చెబుతున్న బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవిస్‌ను కేంద్రం సీబీఐ లేదా ‘రా’ సంస్థల్లో చేర్చుకోవచ్చు కదా అని ఎద్దేవా చేశారు
కోవిడ్ -19 మహమ్మారి సమయంలో బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్‌లో అవినీతికి పాల్పడినట్లు ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకు, మంత్రి నవాబ్ మాలిక్ ఎపిసోడ్‌కు తన ఘాటైన సమాధానంలో, థాకరే బిజెపి ఆరోపణలను పాయింట్ బై పాయింట్‌గా గట్టిగా తిప్పికొట్టారు.
కోవిడ్ మహమ్మారి సమయంలో ‘ముంబయి మోడల్’ ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు లభించాయని, అందులో ఏవైనా లోపాలను ఎత్తి చూపితే  ప్రతిపక్షాలను స్వాగతిస్తామే తప్ప  నిరాధారమైన ఆరోపణలను చేయడం మానేయాలని ఆయన బిజెపికి పిలుపునిచ్చారు.
ముఖ్యంగా మాజీ హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్, ఆ తర్వాత మాలిక్‌ల అరెస్టుల తర్వాత ఈడీ బీజేపీకి ‘సేవకురాలు’గా మారిందా అని ప్రశ్నించారు, ప్రతిపక్షాలు మాలిక్‌ను మాఫియా డాన్ దావూద్‌తో ముడిపెట్టడంపై సీఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
దావూద్‌ను వెనక్కి రప్పిస్తానని రాష్ట్ర బీజేపీ మాజీ హోంమంత్రి, దివంగత గోపీనాథ్ ముండే హామీ ఇచ్చారని, కానీ ఇంతవరకు అది జరగలేదని ఆయన గుర్తు చేశారు.
“అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అల్ ఖైదా నాయకుడు ఒసామా బిన్ లాడెన్‌ను చంపడానికి తన కమాండోలను పాకిస్తాన్‌కు పంపించాడు. దావూద్‌ ఎక్కడున్నాడో గుర్తించి హతమార్చే దమ్ము, ధైర్యం ఉందా?’అని థాకరే పరోక్షంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని ప్రశ్నించారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles