24.2 C
Hyderabad
Tuesday, October 1, 2024

రష్యాతో సాన్నిహిత్యంపై భారత్‌ను హెచ్చరించిన అమెరికా!

వాషింగ్టన్‌: ఉక్రెయిన్‌పై దాడి తర్వాత రష్యాతో అతి సన్నిహిత సంబంధాలు నెరపకూడదని కాకూడదని అమెరికా భారత్‌ను హెచ్చరించిందని అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌ ఉన్నత ఆర్థిక సలహాదారు తెలిపారు. రష్యాతో మరింత స్పష్టమైన వ్యూహాత్మక భాగస్వామ్యం నెలకొనే దిశగా భారత్‌ తీసుకుంటున్న చర్యలు దీర్ఘకాలికమైనవి, అంతేకాదు ఆర్థిక అంశాలు కూడా దీనికి తోడ్పడ్డాయని వైట్ హౌస్ నేషనల్ ఎకనామిక్ కౌన్సిల్ డైరెక్టర్ బ్రియాన్ డీస్ విలేకరులతో అన్నారు.

ఉక్రెయిన్‌తో రష్యా యుద్ధం మొదలుపెట్టిన సందర్భంలో చైనా, భారత్‌ తీసుకన్న నిర్ణయాల వల్ల అమెరికా నిరాశకు గురైందని ఆయన చెప్పారు. ఇతర దేశాల మాదిరిగానే రష్యాపై ఆంక్షలు విధించేందుకు భారత్ నిరాకరించింది.

ఆర్థిక అంశాలపై వార్తలు ప్రచురించే ప్రఖ్యాత అంతర్జాతీయ పత్రిక బ్లూమ్‌బెర్గ్ అంచనాల ప్రకారం, ఆసియాలో చైనా ప్రాబల్యానికి గండికొట్టే దేశం భారతదేశమేమనని అమెరికా గట్టిగా నమ్ముతోంది. అంతేకాదు రష్యా నుంచి ఆయుధాలను అత్యధికంగా దిగుమతి చేసుకునే దేశం కూడా భారతే.

గత వారం అమెరికా డిప్యూటీ జాతీయ భద్రతా సలహాదారు దలీప్ సింగ్ భారత్‌లో అధికారిక పర్యటన చేసిన తర్వాత ఇది జరిగింది. “ఈ పర్యటనలో దలీప్ తన సహచరులకు స్పష్టం చేసిన విషయం ఏమిటంటే, రష్యా నుంచి ఇంధనం, ఇతర వస్తువుల దిగుమతులను వేగవంతం చేయడంపై భారతదేశం ఆసక్తిగా ఉందని మేము నమ్మడం లేదు” అని  దలీప్‌సింగ్‌ భారత్‌నుంచి తిరిగి వచ్చిన తర్వాత  వైట్ హౌస్ ప్రతినిధి జెన్ సాకి  చెప్పారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles