30.2 C
Hyderabad
Tuesday, October 1, 2024

అంతరిక్ష సాంకేతిక హబ్‌గా తెలంగాణ… నేడు స్పేస్ టెక్ పాలసీ ఆవిష్కరణ!

హైదరాబాద్: అంతరిక్ష సాంకేతిక రంగాల రేసులో తెలంగాణను అగ్రగామిగా నిలిపేందుకు కేసీఆర్ సర్కారు సిద్దమైంది. వర్చువల్ ప్రపంచమైన మెటావర్స్ వేదికగా నేడు  (ఏప్రిల్ 18న) తెలంగాణ స్పేస్ టెక్ పాలసీని ఆవిష్కరించనుంది. ఈ మేరకు ఇవాళ సాయంత్రం తెలంగాణ ‘స్పేస్‌-టెక్‌’ విధానాన్ని.. మంత్రి కేటీఆర్‌ లాంఛనంగా విడుదల చేయనున్నారు. దేశంలోనే తొలిసారిగా పూర్తిగా మెటావర్స్ పద్ధతిన వినూత్నంగా జరగనున్న ఈ కార్యక్రమంలో భారీగా రాయితీలు, ప్రోత్సాహకాలు ప్రకటించనున్నారు. నీతి ఆయోగ్‌ సీఈవో అమితాబ్‌కాంత్.. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ-ఇస్రో ఛైర్మన్‌ సోమనాథ్, ఇన్‌స్పేస్‌ సంస్థ ఛైర్మన్‌ పవన్‌ గోయంకాలు అందులో పాల్గొననున్నారు.
తెలంగాణను ప్రపంచంలో గుర్తింపు పొందిన అంతరిక్ష సాంకేతిక హబ్‌గా మార్చేదిశగా ‘స్పేస్‌టెక్‌ పాలసీ (అంతరిక్ష సాంకేతిక విధానం)’ను రాష్ట్ర ఐటీ శాఖ రూపొందించింది. వర్చువల్‌ ప్రపంచమైన ‘మెటావర్స్‌’వేదికగా నేడు స్పేస్ టెక్ పాలసీని విడుదల చేయబోతున్నారు. ‘స్పేస్‌ టెక్‌’కు సంబంధించి గతేడాది సెప్టెంబర్‌లో కొత్త పాలసీ ఫ్రేమ్‌వర్క్‌ ముసాయిదాను రాష్ట్ర ఐటీ విభాగం విడుదల చేసింది. స్పేస్‌ టెక్నాలజీపై పట్టున్న నిపుణులు, శాస్త్రవేత్తలు, స్టార్టప్‌లు, జాతీయ సంస్థలు, స్పేస్‌టెక్‌ పరిశ్రమ యాజమాన్యాల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించి పాలసీని రూపొందించారు.తెలంగాణను ప్రపంచంలో గుర్తింపు

అంతరిక్ష సాంకేతిక రంగంలోనూ ముద్ర చాటాలనే..!
అన్ని రంగాల్లో పురోగమిస్తున్న తెలంగాణను.. అంతరిక్ష సాంకేతిక రంగంలోనూ రాష్ట్ర ముద్రను చాటాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్, పరిశ్రమల మంత్రి కేటీఆర్‌ల సంకల్పమని.. రాష్ట్ర పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ వెల్లడించారు. అంతరిక్ష ఉత్పత్తులు.. సేవల రంగంలో పెట్టుబడుల సమీకరణ, ఆవిష్కరణలతో పాటు అన్ని రకాల అవకాశాలను చేజిక్కించుకొని.. ముందుకు సాగేలా కొత్త విధానం ఉంటుందని తెలిపారు. ఉపగ్రహ ఆధారిత.. అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానం అనుసంధానంతో వ్యవసాయం, విపత్తు నిర్వహణ వంటి రంగాలకు ఎంతో మేలు జరుగుతుందని జయేశ్‌రంజన్‌ వివరించారు.

ఏమిటీ మెటావర్స్‌.. నేటి ఆధునిక యుగంలో చాలా మంది నోట వినిపిస్తున్న మాట మెటావర్స్. ఇదొక సరికొత్త సాంకేతిక మాయా లోకం. కంప్యూటర్‌పై సృష్టించిన కల్పిత ప్రపంచంలో స్వేచ్ఛగా విహరించే వేదిక. భౌతికంగా లేకపోయినా అవతార్‌ల రూపంలో అందరూ ఒకేచోట, ఒకే వేదికపై పరస్పరం మాట్లాడుకొంటారు. చర్చలు, సమావేశాలు, రోజువారీ కార్యకలాపాలు సాగిస్తారు. భౌతిక ప్రపంచంలో చేసే పనులన్నీ మెటావర్స్‌ వేదికగా చేసుకోవచ్చు. మెటావర్స్‌ సాంకేతికతకు ఇది తొలిమెట్టు మాత్రమే. మనల్ని పోలిన లేదా మనకు ఇష్టమైన ఓ రూపాన్ని సృష్టించుకుని మెటావర్స్‌లోకి అడుగుపెడతారు. ఇక బయటినుంచి ఆ పాత్రను నడిపించవచ్చు. మైక్రోఫోన్‌, మౌస్‌, కెమెరా లాంటి సాధారణ పరికరాలతోనే దాన్ని మాట్లాడించవచ్చు లేదా ప్రోగ్రామింగ్‌ చేసి వదిలేయవచ్చు. ఇక వర్చువల్‌ రియాలిటీ పరికరాలు ఉంటే మెటావర్స్‌ పాత్ర మరింత సజీవంగా మారిపోతుంది.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles