30.2 C
Hyderabad
Tuesday, October 1, 2024

ఫ్రాన్స్‌ అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికైన ఇమ్మాన్యుయేల్‌ మెక్రాన్‌!

పారిస్: ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మెక్రాన్‌ మరోసారి పీఠాన్ని దక్కించుకున్నారు. మెక్రాన్ వరుసగా రెండోసారి అధ్యక్ష ఎన్నికల్లో గెలిచారు. అధికారిక ఫలితాలు వెలువడక ముందే ప్రత్యర్థి మరీన్‌ లీపెన్‌ ఓటమిని అంగీకరించారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేస్తున్న వేళ మెక్రాన్‌ రెండోసారి ఎన్నికవడం ఫ్రాన్స్ సహా యూరోపియన్ యూనియన్‌లో నాయకత్వ స్థిరత్వానికి హామీ ఇచ్చింది.
రెండవసారి ఫ్రెంచ్ అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికైన మెక్రాన్‌కు ప్రపంచవ్యాప్తంగా నాయకుల నుండి అభినందనలు వెల్లువెత్తాయి.. మెక్రాన్‌తో కలిసి ఫ్రాన్స్, ఐరోపాలను మరింత అభివృద్ధి చేస్తామని ఈయూ చీఫ్‌ ఉర్సులా వాన్‌డర్ లేయెన్ ట్వీట్ చేశారు. ఈయూ, నాటోలో విస్తృతమైన సహకారాన్ని కొనసాగించాలని ఆశిస్తున్నట్లు డచ్ ప్రధాని ట్వీట్ చేశారు. మెక్రాన్ విజయం సాధించడంతో ఆయన మద్దతుదారులు ఈఫిల్ టవర్ ముందు జాతీయ గీతాన్ని పాడుతూ ఫ్రాన్స్‌, యూరోపియన్ జెండాలను ఊపారు. ఐదేళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో మరీన్‌ లీపై గెలిచి 39 ఏళ్ల మెక్రాన్‌… ఫ్రాన్స్‌లో అతిపిన్న వయసు గల అధ్యక్షుడిగా రికార్డులకెక్కారు.
రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన అనంతరం మెక్రాన్ మాట్లాడుతూ.. దేశంలో చాలా మంది తనకు ఓటువేశారని, అయితే అందరూ తనకు మద్దతు తెలపడం వల్ల గెలవలేదన్నారు. మరీన్ లీ పెన్ అతివాద ఆలోచనలు, ఆమె విధానాలకు సైతం వ్యతిరేకంగా పడిన ఓట్లతో తాను విజయం సాధించానని చెప్పారు. వారి నిర్ణయాన్ని ఫ్రాన్స్ అధ్యక్షుడు స్వాగతించారు. ఫ్రాన్స్ ప్రజలను ఇక్కడి నుంచి విదేశాలకు పారిపోయే పరిస్థితులు రాకుండా చూసుకుంటానని మాటిచ్చారు. ఆయన ప్రత్యర్థి లీ పెన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా తాను దేశం నుంచి పారిపోయే వ్యక్తిని కాదని చేసిన వ్యాఖ్యలకు సైతం తిప్పికొట్టారు. ఆమె చేసిన వ్యాఖ్యలు నిజమైతే ఈరోజు తాను మరోసారి ఫ్రాన్స్ అధ్యక్షుడు అయ్యేవాడిని కాదన్నారు.
సగం కంటే ఎక్కువ ఓట్లను మెక్రాన్ సాధించినా.. ఈ ఎన్నికలు ప్రజల మధ్య స్పష్టమైన విభజనను తేటతెల్లం చేశాయి. ఇక, మెక్రాన్ రెండోసారి అధికారంలోకి వచ్చినా అనేక సవాళ్లు ముందున్నాయి. ముఖ్యంగా జూన్‌లో పార్లమెంట్ ఎన్నికలు జరుగున్నాయి. తన ఆశయాలకు అనుగుణంగా దేశంలో పలు సంస్కరణలు చేపట్టాలంటే పార్లమెంట్‌లో మెజారిటీ చాలా కీలకం. కాబట్టి వచ్చే ఎన్నికల్లో ఆయన పార్టీ స్పష్టమైన ఆధిక్యత సాధించపోతే ఇబ్బందులు తప్పవు.
మోదీ శుభాకాంక్షలు: ఫ్రాన్స్​ అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికైన మెక్రాన్​కు భారత ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో ఇండో-ఫ్రాన్స్‌ వ్యూహాత్మక బంధాన్ని మరింత బలోపేతం చేసే దిశగా మెక్రాన్‌తో కలిసి పనిచేయనున్నట్లు వెల్లడించారు. ఐదేళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో మరీన్‌ లీపై గెలిచి 39 ఏళ్ల మెక్రాన్‌… ఫ్రాన్స్‌లో అతిపిన్న వయసు గల అధ్యక్షుడిగా రికార్డులకెక్కారు.
కేవలం ఐదేళ్లలో అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ రాజకీయాల్లో యువనేత‌గా ఎదిగారు. యూరోపియన్ యూనియన్‌లో కీలక నిర్ణయాలు తీసుకునే ప్రధాన ప్రపంచ నాయకుడిగా ఎదిగిన మెక్రాన్.. ఉక్రెయిన్‌- రష్యా యుద్ధాన్ని ముగించే ప్రయత్నాలలో దౌత్యవేత్తగా పాల్గొన్నాడు. బాహాటంగా మాట్లాడే మాక్రాన్, తన కనికరంలేని దౌత్య క్రియాశీలతతో తన స్వంత మార్గాన్ని ఎంచుకున్నారు. అంతర్జాతీయంగా తనకంటూ ఒక సముచిత స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. రెండవసారి ఫ్రెంచ్ అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికైన మెక్రాన్‌కు ప్రపంచవ్యాప్తంగా నాయకుల నుండి అభినందనలు వెల్లువెత్తాయి. మెక్రాన్‌తో కలిసి ఫ్రాన్స్, ఐరోపాలను మరింత అభివృద్ధి చేస్తామని ఈయూ చీఫ్‌ ఉర్సులా వాన్‌డర్ లేయెన్ ట్వీట్ చేశారు. ఈయూ, నాటోలో విస్తృతమైన సహకారాన్ని కొనసాగించాలని ఆశిస్తున్నట్లు తెలిపారు

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles