26.7 C
Hyderabad
Tuesday, October 1, 2024

సౌదీ పర్యటనకు వచ్చిన టర్కీ అధ్యక్షుడు ఎర్దోగాన్‌… ఇరుదేశాల సంబంధాలలో కొత్త శకానికి నాంది!

రియాద్: టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ ఐదేళ్ల తర్వాత మొదటి సారి సౌదీ పర్యటనకు వచ్చారు. సౌదీ అగ్ర నాయకత్వంతో సమావేశమయ్యారు. ఈ పరిణామం రెండు దేశాల మధ్య సంబంధాల్లో కొత్త శకానికి నాంది పలికింది. సౌదీ రాజు సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్ గురువారం జెద్దా ఎర్డోగాన్‌కు స్వాగతం పలికారు. ఇద్దరు నాయకులు అల్ సలామ్ రాయల్ ప్యాలెస్‌లో క్లోజ్డ్ డోర్ సమావేశాన్ని నిర్వహించారు. సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్‌ను కూడా ఎర్డోగన్ ప్యాలెస్‌లో కలిశారు.
సౌదీ అరేబియాలో అధ్యక్షుడు ఎర్డోగాన్ తన రెండు రోజుల పర్యటన ఇస్లాంలో అత్యంత పవిత్రమైన రాత్రి లైలత్అల్ ఖదర్‌ తరువాతి రోజే ఆరంభించడం విశేషం. “మేము మా సంబంధాలను గతంలో ఉన్న స్థాయికి మించి ఇంకా పై స్థాయికి తీసుకువెళతామని నేను నమ్ముతున్నాను; నా పర్యటన సౌదీ అరేబియాతో కొత్త శకానికి తలుపులు తెరుస్తుంది” అని సౌదీ అగ్ర నాయకులను కలిసిన తర్వాత ఎర్డోగాన్ అన్నారు. అంకారా అన్ని రకాల ఉగ్రవాదానికి వ్యతిరేకమని, వాటికి వ్యతిరేకంగా గల్ఫ్ దేశాలతో సహకారానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తుందని ఆయన అన్నారు.

గల్ఫ్ భద్రత
పునరుత్పాదక ఇంధన సాంకేతికతలపై అంకారా-రియాద్‌ల మధ్య సహకారానికి ఎంతో ప్రాముఖ్యత ఉందని ఎర్డోగాన్
అన్నారు. రియాద్‌తో “ఎనర్జీ, ఫుడ్ సెక్యూరిటీ, వ్యవసాయ సాంకేతికతలు, రక్షణ పరిశ్రమలు, ఫైనాన్స్” వంటి అంశాలలో సహకారాన్ని మరింతగా పెంచుకోవడం మా ఉమ్మడి ప్రయోజనాలలో ఉందని ఎర్డోగన్ అన్నారు.
ఇటీవలి సంవత్సరాలలో అనేక వివాదాలను ఎదుర్కొన్న మధ్యప్రాచ్యంలో భద్రతపై కూడా ఆయన దృష్టి సారించారు. “గల్ఫ్ ప్రాంతంలోని మన సోదరుల స్థిరత్వం, భద్రత మనకు అత్యంత ముఖ్యమైనవి” అని టర్కీ అధ్యక్షుడు అన్నారు. కింగ్ సల్మాన్ ఆహ్వానం మేరకు ఐదేళ్ల తర్వాత ఎర్డోగన్ అరబ్ దేశంలో పర్యటనకు వచ్చారు.

సంబంధాలను పునరుద్ధరించడం
రాజకీయ ఉద్రిక్తతల కారణంగా అంకారా మరియు రియాద్ మధ్య సంబంధాలు ఇటీవలి కాలంలో బాగా క్షీణించాయి. అయితే రెండు దేశాలు ఇప్పుడు సంబంధాలను పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తున్నాయి. గత ఏడాది ఏప్రిల్, మే నెలల్లో ఎర్డోగాన్, కింగ్ సల్మాన్ ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు.
జూలై 2021లో, విదేశాంగ మంత్రి మెవ్‌లుట్ కావూసోగ్లు తన సౌదీ కౌంటర్ ఫైసల్ బిన్ ఫర్హాన్ అల్ సౌద్‌ను కలిశారు, దీనిని “ఫలవంతమైన సమావేశం”గా అభివర్ణించారు. సౌదీ అరేబియాతో పాటు, టర్కీయే ఈజిప్ట్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌తో
సంబంధాలను చక్కదిద్దుకునే ప్రయత్నంలో టర్కీ అధ్యక్ష ప్రతినిధి ఇబ్రహీం కలిన్ ఆగస్టునుంచి చర్చలు జరుపుతున్నారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles